టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన తాజా చిత్రం `ది ఘోస్ట్`. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను షురూ చేసిన మేకర్.. తాజాగా `ది ఘోస్ట్` ట్రైలర్‌ను బయటకు వదిలారు. నాగార్జున-సోనాల్ చౌహాన్ మధ్య నడిచే రొమాంటిక్ సాంగ్ ఇది. `నీలి నీలి సంద్రం.. నింగిలోని మేఘం నిన్ను చేరమంది వేగం` అంటూ సాగే ఈ మెలోడియస్ సాంగ్ లో సోనాల్ గ్లామరస్‌గా, నాగార్జున సూపర్ స్మార్ట్‌గా కనిపిస్తూ అలరించారు.

కృష్ణ మదినేని రచించిన ఈ పాటను కపిల్ కపిలన్, రమ్య బెహరా అద్భుతంగా ఆలపించారు.ఈ సాంగ్‌లోని లోకేషన్స్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే నాగార్జునలోని మన్మధుడు మరోసారి బయటకు వచ్చి రెచ్చిపోయాడని ఈ పాటలోని పలు సీన్స్‌ను చూస్తుంటేనే అర్థమవుతోంది.
మొత్తానికి అదిరిపోయిన ది ఘోస్ట్ ఫస్ట్ సింగిల్.. ప్రస్తుతం యూట్యూబ్‌లో బాగానే ట్రెండ్ అవుతోంది. కాగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు.