The Great Indian Suicide Review: ఆత్మహత్య ఆధారంగా ఎన్నో కథలు చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం.అదే నేపథ్యంలో కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా తీసుకునిహెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఎంత ఆసక్తికరంగా సాగింది ?ఈ చిత్రంలో ఎలాంటి మలుపులు వున్నాయి ?అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే

హేమంత్ (రామ్ కార్తీక్) అనాథ. స్నేహితుడితో కలిసి కాఫీ షాపు నడుపుతూ ఉంటాడు. కుకీస్ ని అమ్మడానికి కేఫ్ కి వస్తుంది చైత్ర (హెబ్బా పటేల్). తొలి పరిచయంలోనే ఆమెను ఇష్టపడతాడు హేమంత్. హేమంత్ ప్రేమని చైత్ర అంగీకరించదు. దీంతో ఊరు విడిచి వెళ్లిపోవాలనుకుంటాడు హేమంత్. విషయం తెలుసుకున్న చైత్ర.. ప్రేమను అంగీకరించకపోవడానికి అసలు కారణం చెబుతుంది. త్వరలోనే తనతో పాటు తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోబోతోందని చెబుతుంది. ఇలా నిర్ణయానికి రావడానికి…

కారు ప్రమాదంలో చనిపోయిన తన పెదనాన్న బళ్ళారి నీలకంఠ (నరేష్)ను తిరిగి బతికించుకునేందుకు ఇదొక మార్గమని వాళ్ళ నమ్మకం. ఈ విషయం తెలుసుకున్న హేమంత్ షాక్ అవుతాడు. తను ప్రేమించిన చైత్రను కాపాడుకునేందుకు ఆమెను పెళ్లి చేసుకొని ఆ కుటుంబంలో ఒకడిగా వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది ? అసలు సాముహిక ఆలోచన ఆ కుటుంబంలో కలిగించింది ఎవరు ? హేమంత్ ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగాడా లేదా ? అనేది మిగత కథ.

నిజానికి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కి తగ్గ అన్ని ఎలిమెంట్స్ కుదిరాయి. అయితే ఇలాంటి కథలకు చిక్కుముళ్ళు విప్పే నేర్పు కూడా వుండాలి. అసలు ఈ ఆత్మహత్యలని ప్రేరేపించింది ఎవరు ? అని తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే వుంటుంది.చివరి పదిహేను నిమిషాల్లో కథ చాలా మలుపులు తిరిగేస్తుంది. అందులో కొన్ని మలుపులు కాస్త గంధరగోళంగా వుంటాయి.

చైత్రగా చేసిన హెబ్బా నటన బావుంది. చివర్లో ఆమె కనబరిచిన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇది ఆమెకు ప్రత్యేకమైన పాత్రే. రామ్ కూడా ఆకట్టుకున్నాడు. బళ్ళారి నీలకంఠయ్య పాత్రలో నరేష్, ఆయన భార్య పాత్రలో పవిత్ర లోకేష్ కనిపించారు. నరేష్ మెథడ్ యాక్టర్. ఆయనకి ఎలాంటి పాత్ర ఇచ్చిన అందులోకి దూరిపోతారు. నీలకంఠ పాత్రలో కూడా సహజంగా చేశాడు. మిగతానటీనటులు అంతా పరిధిమేర చేశారు. శ్రీచరణ్ అందించిన నేపధ్య సంగీతం బావుంది. కెమరాపనితనం ఇలాంటి సినిమాలకీ చాలా ముఖ్యం. విజువల్స్ ఇంకాస్త బాగా ఎఫెక్టివ్ గా వుండాల్సింది.ఓటిటిఏ కాబట్టి ఒకసారి సినిమా చూడొచ్చు