30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
Entertainment News సినిమా

Rashmika Mandanna: రష్మిక మందనకి ఊహించని షాక్ ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీ..??

Share

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన అందరికీ సుపరిచితురాలే. తెలుగులో “చలో” సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తిరుగులేని హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక రెండో సినిమా “గీతాగోవిందం” తో మరో బ్లాక్ బస్టర్ అందుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా.. వరుస అవకాశాలు అందుకుంది. ఇక గత ఏడాది “పుష్ప” సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయింది. “పుష్ప” సినిమాలో “నా సామి బంగారు సామి” స్టెప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించింది.

The Kannada industry gave an unexpected shock to Rashmika Mandana
Kantara

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అనేక సినిమాలు చేస్తున్న.. రష్మిక కి కన్నడ ఇండస్ట్రీ ఊహించని షాక్ ఇచ్చింది. మేటర్ లోకి వెళ్తే రష్మి కానీ కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడం జరిగిందట. వాస్తవానికి రష్మికది కన్నడ ఇండస్ట్రీ సొంతది. ఆమె కెరియర్ అక్కడే స్టార్ట్ అయింది. మోడలింగ్ రంగంలో రష్మిక రాణించిన క్రమంలో ఆమె ఫోటోలు చూసి…దర్శకుడు రిషబ్ శెట్టి.. కిరాక్ పార్టీ అనే సినిమాలో హీరోయిన్ గా ఆమెకు అవకాశం ఇవ్వటం ఆ సినిమా హిట్ కావడం జరిగింది. కనడాలో మంచి పాపులారిటీ సంపాదించడం అక్కడి హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ ఆ తర్వాత తెలుగులో సెటిల్ కావటం కన్నడ ఇండస్ట్రీకి దూరం అవటంతో పాటు ఆమె నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా కనడ ఇండస్ట్రీలో.. బ్లాక్ బస్టర్ చిత్రం “కాంతారా” గురించి ఓ ఇంటర్వ్యూలో రష్మికకి ప్రశ్న ఎదురయిందంట.

The Kannada industry gave an unexpected shock to Rashmika Mandana
Rashmika Mandana

“కాంతారా” సినిమా చూశారా అని యాంకర్ ప్రశ్నించడం జరిగిందంట. ఈ ప్రశ్నకు రష్మిక ఇచ్చిన సమాధానం.. నేను ఇంకా చూడలేదు నాకు అంత టైం లేదని చెప్పింది అంట. దీంతో కన్నడ ప్రేక్షకులు ఫీల్ అయ్యి రష్మిక మందన కామెంట్లకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో రష్మిక నీ కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సొంత రాష్ట్రానికి చెందిన సినిమాలు గురించి తక్కువ చేసి మాట్లాడినట్లు.. కన్నడ ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతో ఆమెను.. కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.


Share

Related posts

RRR Trailer review: “RRR” ట్రైలర్ తోనే కుంభస్థలాన్ని టార్గెట్ చేసిన రాజమౌళి..!!

sekhar

ప్రభాస్ ని సలహా అడిగిన నితిన్..??

sekhar

Dharsha Gupta Cute Images

Gallery Desk