NewsOrbit
Entertainment News సినిమా

Salaar: ప్రభాస్ “సలార్” విడుదల తేదీ ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్..!!

Share

Salaar: పాన్ ఇండియా నేపథ్యంలో ప్రభాస్ ఇమేజ్ ఏర్పడ్డాక సరైన హిట్ పడలేదు. బాహుబలి వంటి చరిత్ర ఆత్మకమైన విజయం సాధించిన తర్వాత.. ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. మరోపక్క ప్రతి సినిమాకి కొన్ని వందల సంవత్సరాలు పాటు ప్రభాస్ స్టైల్ కేటాయిస్తూ ఉండటం ఫలితాలు అట్టర్ ఫ్లాప్ కావటం అభిమానులను ఎంతగానో నిరుత్సాహపరుస్తూ ఉంది.

The makers released a video announcing the release date of Prabhas Salaar

ఇలాంటి తరుణంలో కేజిఎఫ్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ లను దడ దడ లాడించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం “సలార్” అనే సినిమా చేయటంతో… అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో కూడా శృతిహాసన్ ఇరగదీసినట్లు సమాచారం. ఇంకా మీనాక్షి చౌదరి, పృథ్వీరాజ్, జగపతిబాబు వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 28వ తారీకు విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది.

The makers released a video announcing the release date of Prabhas Salaar

ది మోస్ట్ వైలెంటెడ్ మాన్ వచ్చేస్తున్నాడు అని.. తెలియజేయడం జరిగింది. ఎప్పటినుండో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకి సంబంధించి అప్ డేట్ అడుగుతున్నారు. తాజాగా సినిమా విడుదల తేదీతో కూడిన వీడియో రిలీజ్ చేయడంతో… ఫ్యాన్స్ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాలో మాఫియా లీడర్ గా ప్రభాస్ అత్యంత పవర్ ఫుల్ రోల్ లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్లు సమాచారం. “కేజిఎఫ్” సినిమాతో దేశవ్యాప్తంగా ప్రశాంత్ నీల్ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక “బాహుబలి”తో ప్రభాస్ కి ఉన్న మాస్ ఇమేజ్ తో… వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న…”సలార్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో “ఆది పురుష్” సెప్టెంబర్ నెలలో “సలార్” లతో మొత్తం రెండు సినిమాలతో ప్రేక్షకులను ప్రభాస్ పలకరించబోతున్నారు. మరి ఈ రెండు సినిమాలలో ప్రభాస్ కి పెద్ద హిట్ ఏది పడుతుందో చూడాలి.

 


Share

Related posts

Raviteja: రవితేజ ప్లాన్స్‌కు చెక్ పెట్టిన ఖిలాడి..ఇక బాలీవుడ్ మీద ఆశలు లేనట్టే

GRK

`వాల్మీకి` టీజ‌ర్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

Siva Prasad

రివ్యూ : బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి..! తరతరాల ప్రేమకథ తలరాత…

siddhu