టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజా చిత్రమే `ది వారియర్`. తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తే.. ఆది పినిశెట్టి విలన్‌గా చేశాడు. అక్షరా గౌడ, నదియా, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మించారు. రామ్ తన కెరీర్లోనే ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ చేసిన సినిమా ఇది. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుండే మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
అయినప్పటికీ రామ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీకెండ్ వరకు బాగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. వర్కింగ్ డేస్‌లో మాత్రం వీక్ అయిపోయింది. టికెట్ రేట్స్ ని సైతం తగ్గించక పోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా స్లో డౌన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వారం రోజుల్లో రూ. 16.35 కోట్ల షేర్‌ను సొంతం చేసుకోగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 19.02 కోట్లను రాబట్టింది. ఇక ఏరియాల వారీగా ది వారియర్ తొలి వారం కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం- రూ. 5.44 కోట్లు
సీడెడ్- రూ. 2.88 కోట్లు
యూఏ- రూ. 2.27 కోట్లు
తూర్పు- రూ. 1.26 కోట్లు
వెస్ట్ : రూ- 1.12 కోట్లు
గుంటూరు- రూ. 1.87 కోట్లు
కృష్ణా- రూ. 0.90 కోట్లు
నెల్లూరు- రూ. 0.61 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ= రూ. 16.35 కోట్ల(రూ.25.20~ గ్రాస్)
—————————-
కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా: రూ. 0.95 కోట్లు
ఓవర్సీస్- రూ. 0.62 కోట్లు
తమిళ వర్షన్- రూ. 1.10 కోట్లు
————————–
వరల్డ్ వైడ్ కలెక్షన్= రూ. 19.02 కోట్లు(రూ.32.20 కోట్లు~ గ్రాస్)
————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 38.10 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 39.00 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే.. ఫస్ట్ వీకెండ్ వచ్చిన కలెక్షన్స్ కాకుండా రామ్ ఇంకా రూ. 19.98 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది.