Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం `ది వారియర్`. తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్‌గా అలరించబోతున్నాడు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ మూవీలో రామ్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 14న తెలుగుతో పాటు తమిళంలోనూ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేయగా.. మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే ఈమూవీ థియేట్రికల్ బిజినెస్ ఎవరూ ఊహించని రేంజ్ లో జరుగుతోందట. తెలుగు థియేట్రికల్ హక్కులు దాదాపు 40 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. `ది వారియర్` వైజాగ్ హక్కులను హీరో రామ్ కొనుగోలు చేశారట.
అందుకు గానూ ఆయన రూ. 4.32 కోట్ల చెల్లించారని అంటున్నారు. `ది వారియర్`పై ఉన్న కాన్ఫిడెన్స్‌తోనే రామ్ ఆ పని చేశాడని తెలుస్తోంది. మరోవైపు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి ఆ అంచనాలను రామ్ అందుకుంటాడో..లేదో.. చూడాలి.