టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, క్రేజీ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `ది వారియర్`. కోలీవుడ్ డైరెక్టర్ ఎన్.లింగుసామి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
ఇందులో ప్రముఖ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా.. రామ్ తన కెరీర్‌లోనే తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా అలరించబోతున్నాడు. రేడియో జాకీగా కృతి శెట్టి కనిపించనుంది. కొద్ది నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 14 అంటే మరి కొన్ని గంటల్లోనే తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది.
ఒకే వేదికపై సందడి చేయనున్న బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్..స్పెషల్ ఏంటో?
ఇప్పటికే బుక్కింగ్స్ సైతం ఊపందుకున్నాయి. ఇకపోతే తాజాగా ది వారియర్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. రామ్ గత చిత్రాలతో పోలిస్తే.. ది వారియర్‌కు భారీగా బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 30 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. తమిళంలో రూ. 4 కోట్ల స్థాయిలలో బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ ది వారియర్ టోటల్ బిజినెస్ లెక్కలను ఓ సారి గమనిస్తే..
నైజాం: 10 కోట్లు
సీడెడ్: 5 కోట్లు
ఆంధ్రా: 15 కోట్లు
————————–
ఏపీ+తెలంగాణ= 30 కోట్లు
————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 2 కోట్లు
ఓవర్సీ: 2.10 కోట్లు
తమిళ వెర్షన్: 4 కోట్లు
——————————-
వరల్డ్ వైడ్ బిజినెస్= 38.10కోట్లు
——————————-
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 38.10 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రేపు రూ. 39.00 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగితోంది. మరి ఇంత పెద్ద టార్గెట్‌ను రామ్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంటాడో..లేదో.. ఇంకొన్ని గంటల్లో తేలనుంది.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…