The Warriorr Trailer: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ది వారియర్`. ఇందులో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించాడు. అక్షరా గౌడ, నదియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ నేటి సాయంత్రం అనంతపూర్ లోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఓ ఈవెంట్‌ను ఏర్పాడు చేసి `ది వారియర్` ట్రైలర్‌ను బయటకు వదిలారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
`ఒక చెట్టు మీద నలభై పావురాలు ఉన్నాయి.. అందులో ఒక్క పావురాన్ని కాలిస్తే ఎన్ని ఉంటాయి.. అన్నీ ఎగిరిపోతాయి` అంటూ రామ్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. డీసీపీ సత్యగా రామ్ తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మెంటలెక్కించేశాడు.
కర్నూలు నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న చిత్రమిది. మాస్ ఎలిమెంట్స్, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో పుష్కలంగా ఉండనున్నాయని ట్రైలర్ బట్టీ స్పష్టమైంది. రామ్-కృతిల లవ్ ట్రాక్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు కూడా బాగున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి లేటెందుకు ది వారియర్ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేసేయండి.