Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆదివారం స్టార్ట్ అయ్యింది. ఏడో సీజన్ లో చాలామంది సీరియల్ నటులతో పాటు.. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు పోటీదారులుగా హౌస్ లో అడుగు పెట్టారు. మొదటిరోజు మొత్తం 14 మంది హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది. వాళ్లు వివరాలు చూస్తే మొట్టమొదట హౌస్ లో అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్ ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్. ఈమె “బలగం” సినిమాలో పొట్టి పిల్ల పాటకు డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో 2019 వరకు బిజీగా ఉన్న ప్రముఖ నటుడు శివాజీ ఎంట్రీ ఇచ్చారు. మూడో కన్టెస్టెంట్ గా సింగర్ దామిని బట్ల ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
ఇక నాలుగో కంటెస్టెంట్ గా మోడల్, నటుడు ప్రిన్స్ యావర్ ఎంట్రీ అవ్వడం జరిగింది. ఐదో కంటెంట్ గా శుభశ్రీ హౌస్ లో అడుగు పెట్టింది. ఆరో ఇంటి సభ్యురాలిగా ప్రముఖ నటి షకీలా.. ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఏడో కంటెస్టెంట్ ఆట సందీప్… హౌస్ లో ఎంట్రీ అవటం జరిగింది. ఎనిమిదో ఇంటి సభ్యురాలుగా కార్తీకదీపం సినిమాలో మోనిత పాత్ర చేసిన శోభా శెట్టి హౌస్ లో అడుగు పెట్టింది. తొమ్మిదో కంటెస్టెంట్ ప్రముఖ నటి రతిక ఇంకా పదవ కంటెస్టెంట్ జబర్దస్త్ కమెడియన్ తేజ, 11వ కంటెస్టెంట్ గౌతం కృష్ణ, 12వ కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. 13వ కంటెస్టెంట్ గా అమర్ హౌస్ లోకి అడుగుపెట్టారు. రైతు యూట్యూబ్ పల్లవి ప్రశాంత్ కూడా ఎంట్రీ అవటం జరిగింది.
ఈసారి మొత్తం 14 మంది సీజన్ సెవెన్ లో పోటీదారులగా హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. సీజన్ సెవెన్ షో స్టార్టింగ్ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ తో పాటు నవీన్ పోలిశెట్టి రావటం జరిగింది. నాగార్జున యధావిధిగా ఆకట్టుకునే రీతిలో హోస్టింగ్ చేశారు. ఇదిలా ఉంటే సోమవారం జరగబోయే ఎపిసోడ్ లో మొదటి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.