RC15: `ఆర్ఆర్ఆర్` వంటి భారీ విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న చిత్రమే `ఆర్సీ 15`. ఇండియన్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంటే.. జయరామ్, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సునీల్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది. ఇకపోతే ఈ మూవీకి సర్కారోడు, అధికారి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని ఇప్పటికే వార్తలు వచ్చి నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే తాజాగా మరోసారి టైటిల్ హడావుడి మొదలైంది.
లేటస్ట్ సమాచారం ప్రకారం.. `ఆర్సీ 15` కోసం శంకర్ ఆఖరికి `అధికారి` టైటిల్‌నే ఫిక్స్ చేశారని, త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోందని తెలస్తోంది. ఓ మంచి రోజును పురస్కరించుకుని టైటిల్ పోస్టర్‌ను బయటకు వదిలేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
కాగా, పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో 50వ చిత్రంగా తెరకెక్కబోతుండటం విశేషం.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…