NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Tollywood Actress: బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. యూత్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

Tollywood Actress: ఫైన ఫోటోలో కళ్ల‌ద్దాలు పెట్టుకుని బొద్దుగా క‌నిపిస్తున్న ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతోంది. యూత్ క్ర‌ష్‌గా మారింది. తెలుగు సినిమాతో హీరోయిన్ గా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన ఆమె.. ఇప్పుడు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీని ఏలేస్తోంది. ఇంత‌కీ ఆమె మ‌రెవ‌రో కాదు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. చెన్నైలో మలయాళీ కుటుంబంలో క‌ళ్యాణి జ‌న్మించింది. ఆమె తండ్రి ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌కుడిగా, స్క్రీన్ రైట‌ర్ మ‌రియు నిర్మాత‌గా మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర వేశారు. అలాగే క‌ళ్యాణి త‌ల్లి లిస్సీ ఒక‌ప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.

సౌత్‌లోని అన్ని ప్ర‌ధాన భాష‌ల్లో ప‌ని చేశారు. తెలుగులో సాక్షి, మ‌గాడు, దోషి నిర్దోషి, 20వ శతబ్దం, ఆత్మ బంధం ఇలా అర‌డ‌జ‌న్‌కు పైగా చిత్రాల్లో లిస్సీ న‌టించారు. క‌ళ్యాణికి సిద్ధార్థ్ అనే తమ్ముడు ఉన్నాడు. 2013లో ప్రొడక్షన్ డిజైనర్‌గా ఇండ‌స్ట్రీలో కెరీర్ ప్రారంభించిన క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌.. తెలుగు చిత్రం హలో ద్వారా హీరోయిన్ గా మారింది. విక్ర‌మ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ లో అఖిల్ అక్కినేనికి జోడీగా క‌ళ్యాణి న‌టించింది. యుక్త‌వ‌య‌సులో చాలా బొద్దుగా ఉన్న క‌ళ్యాణి.. ఆ త‌ర్వాత స‌న్న‌గా మ‌ల్లెతీగ‌లా మారింది. హీరోయిన్‌ అయ్యేందుకు విపరీతంగా కష్టపడి వెయిట్ లాస్ అయింది.

హ‌లో మూవీలో త‌న‌దైన అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. కానీ 2017లో విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధింయ‌లేదు. అయితే 2019లో చిత్రలహరి సినిమాతో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తొలి హిట్ అందుకుంది. ఆపై రణరంగంలో శ‌ర్వానంద్ కు జోడీగా క‌నిపించిన ఆమె.. హీరో మూవీతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి, వారనే అవశ్యముండ్ చిత్రంతో మ‌ల‌యాళంలోకి ప్ర‌వేశించింది. 2021లో వ‌చ్చిన మాన‌డు మూవీ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో కోలీవుడ్ లో క‌ళ్యాణికి భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

మ‌రోవైపు మ‌ల‌యాళంలో హృదయం, బ్రో డాడీ వంటి సినిమాలు ఆమెకు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ప్ర‌స్తుతం మ‌ల‌యాళ‌, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. త‌మిళంలో ఈ బ్యూటీ జెనీ అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది. నూతన దర్శకుడు భువనేష్ అర్జునన్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్న‌ ఈ ఫాంటసీ కామెడీ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి కె. గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయం రవి హీరో కాగా.. కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ మరియు వామికా గబ్బి హీరోయిన్లుగా చేస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న జెనీ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N