KGF: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కేరాఫ్ కంచరపాలెం అనే సినిమా తీసిన వెంకటేష్ మహా అందరికీ సుపరిచితుడే. ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అదేవిధంగా హీరో యాష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వెబ్ మీడియా ఛానల్స్ కీ ఇంటర్వ్యూ ఇస్తూ చాలామంది ప్రముఖ వ్యక్తులపై కామెంట్లు చేస్తున్నారు. ఈ రకంగా కామెంట్లు చేసి వైరల్ అవుతూ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. అయితే ఈ రకంగానే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా..పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరో యాష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
KGF ఫస్ట్ పార్ట్ ఎంత సూపర్ హిట్ అయిందో దానికి డబల్ గత ఏడాది రిలీజ్ అయిన సెకండ్ పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఏకంగా ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి వెంకటేష్ మహా మాట్లాడుతూ….”నేను సినిమా పేరు చెప్పదలుచుకోవట్లేదు .. ఈ మధ్యకాలంలో ఆ సినిమా బాగా పాపులారిటీ దక్కించుకుంది.. ఓ మూవీలో తల్లి హీరోని ఒక కోరిక కోరుతుంది ..నువ్వు బాగా బంగారం సంపాదించి చాలా ధనవంతుడు కావాలి అని కోరుకుంటున్నాను అంటుంది ..దీంతో హీరో జనాలతో గనులు తవ్వించి బంగారం బయటకి తీస్తాడు.. లాస్ట్ లో అలా ఇలా మాటలు చెప్పి బంగారం తీసుకెళ్ళిపోతాడు.
అసలు వాడు హీరోనా.. వాడు నీచ్ కమీన్ కుత్తే.. వాడి చుట్టూ కొన్ని వేల మంది ఉంటారు ..అయినా కానీ వాడు ఇలాంటి పనిచేస్తాడు ..వాళ్ళందరినీ వదిలేసి ..ఆ బంగారాన్ని ఓ చోట పారదొబ్బుతాడు .. అసలు వాడిని ఎవరైనా హీరో అంటాడా..? నిజమైన హీరో ఇలాంటి పని చేస్తాడా..? దీనిని అసలు గొప్ప కథ అంటారా..? అలాంటి చెత్త కథని జనాలు ఎగబడి చూడడం ఏంటి ..? “అంటూ పరోక్షకంగా కే జి ఎఫ్ సినిమాను.. సినిమాలో నటించిన హీరో యష్ ను.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో కన్నడ హీరో యాష్ అభిమానులు మండిపడుతున్నారు. వెంటనే వెంకటేష్ మహా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.