వినాయక చవితి.. హిందువుల అతిముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే నాలుగో రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని కోలిస్తే.. ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, సంపదలు, సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు.
అయితే అన్ని పండగల కంటే వినాయక చవితి చాలా విభిన్నంగా ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా విఘ్నేషుడి విగ్రహాలను ప్రతిష్టించి.. ఉత్సవాలు జరుపుతుంటారు. అందుకే ఈ పండుగను పెద్దలే కాదు పిల్లలు కూడా ఎంతగానో ఇష్టపడతారు.
ఇక మన టాలీవుడ్ హీరోల ఇంట కూడా గణపతి పూజ ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. మరి ఇంకెందుకు మన తెలుగు హీరోలు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.