Trinayani October 27 Episode 1069: మనవరాలను ఎత్తుకొని కక్కుడు పూస తన మెడలో వేస్తూ ఈ పూసల దండ ఉలోచి ప్రాణం తీస్తుంది అని తన మెడలో వేస్తుంది సుమన వాళ్ళ అమ్మ. మన వాడికి కూడా రెండు పూసల దండై మెయి పాలు బాగా అరుగుతాయి అని వల్లభ అంటాడు. మీరు నాలుగు వేసుకోండి మందు మానేసి పాలు బాగా తాగుతారు అని హాసిని అంటుంది. పిల్లల గురించి మి గొడవ ఏంటి ఆపండి అని తిలోత్తమ అంటుంది. అదేమన్నా తల్లిపాలిస్తుద డబ్బా పాలే కదా అత్తయ్య అయ్యే అరుగుతాయి అని విక్రాంత్ అంటాడు. దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అక్క పిల్లలు చూడు ఎంత బలంగా ఉన్నారో తల్లి పాలు ఇవ్వడం వల్ల అని వాళ్ళ అమ్మ అంటుంది. కన్న పిల్లల కన్నా నీకు అనాధ పిల్లలు బలంగా అందంగా కనిపిస్తున్నారు అని సుమన అంటుంది. ఏ సుమ్మి ఎందుకే అలాంటి మాటలు మాట్లాడే దెబ్బలు తింటావు ఊరుకో అని దూరందర అంటుంది. మీ మాటలతో పొద్దు పోనిస్తారా పూజ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా అని తిలోతమ అంటుంది.

వెళ్లండి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండండి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు అని విశాలాక్షి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ఎవరిని అంటున్నావు అని సుమన వాళ్ళ అమ్మ అంటుంది. నిన్ను అనట్లేదు లేమ్మా అందరికీ చెప్తున్నాను అమ్మ నాకు అల్పాహారం పెడుదువు గాని పద అని విశాలాక్షి అంటుంది. సరే పద అని విశాలాక్షిని తీసుకుని లోపలికి నైని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే పావన మూర్తి స్వీట్లు తింటూ ఆహా ఎంత బాగున్నాయి తిన్నట్టే లేవు అని అంటూ ఉంటాడు.అలాంటప్పుడు తినడం ఎందుకు బాబాయ్ తినకు అని హాసిని అంటుంది. ఏంటమ్మా కౌంటర్లు వేస్తున్నావు అని పావన మూర్తి అంటాడు.నీ మీద కౌంటర్లు ఎందుకు వేస్తాను బాబాయి అని హాసిని పావన మూర్తి పొట్ట మీద కొడుతుంది.

చూడమ్మా ఇంకెక్కడైనా కొట్టుగాని నా పొట్ట మీద మాత్రం కొట్టకు అని పావన మూర్తి అంటాడు. అది పొట్ట అనుకున్నావా యాదగిరిగుట్ట అనుకున్నావా వదిన అలా బలంగా కొడుతున్నావు అని విక్రాంత్ అంటాడు.రేయ్ బలం అంత పని మీద చూపించాలి కానీ మామయ్య పొట్ట మీద కాదురా అని విశాల్ అంటాడు. అన్నీ మాటలేనా పూజ పనులు ఏమైనా చేస్తారా అని వల్లభ అంటాడు. మీరు చెయ్యరా అని హాసిని అంటుంది. పూజ చెయ్యాలన్న ఇంటి యజమాని రాలేనా త్రినైని ఎక్కడ విశాల్ అని తిలోత్తమ అంటుంది. వాళ్ళ అమ్మ వచ్చిందని అక్క చెల్లెలు గొడవలు పక్కన పెట్టేసి వాళ్ళ అమ్మ ఒడిలో తలలు పెట్టి పడుకున్నారేమో అని దురంధర అంటుంది. ఇంతలో నైని విశాలాక్షి వాళ్ళ అమ్మ అందరూ హాల్లోకి వస్తారు. అందరూ వచ్చారు కానీ సుమన ఎక్కడ అని హాసిని అంటుంది. పని చెబుతారని ఎక్కడ కూర్చుందో అని విక్రాంత్ అంటాడు. నేను పని దొంగను కాదు గాని నగల దొంగ ఎవరో చెప్పండి అని సుమన అంటుంది. ఎవరినగలు నైనివా హాసినివా అని విశాల్ అంటాడు. ఎవరివో అయితే నేనెందుకు అడుగుతాను బావగారు అని సుమన అంటుంది. నీ దగ్గర డబ్బే లేదని అన్నావు కదే మరి అన్ని నగలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని వాళ్ళ అమ్మ అంటుంది.

ఉలోచి ని కన్నందుకు ఆనందంగా ఉండమని విశాల్ బ్రో 10 కోట్లు ఇచ్చాడు అత్తయ్య వాటిలో కోటి రూపాయలు బట్టలకు నగలకే తగలబెట్టింది అని విక్రాంత్ అంటాడు. తగలబెడితే కరిగిపోతాయి కానీ అయ్యి కనిపించట్లేదు ఏమైపోయాయో అని అడుగుతుంది రా మరదలు అని వల్లభ అంటాడు. పప్పు ముద్దలా నిలబడి చూస్తున్నావు ఏంటి గారడి పిల్ల ఇప్పుడు ఏమి మాట్లాడవేంటి అని తిలోత్తమ అంటుంది. తను ఎందుకు మాట్లాడుతుంది మమ్మీ సైలెంట్ గా ఉంటే తనమీద నింద పడదుగాని ఏమీ మాట్లాడట్లేదు ఏమో అని వల్లభ అంటాడు. విశాలాక్షి మీద ఇంకొకసారి నింద వేస్తే బాగోదు అని నైని గట్టిగా అంటుంది. మమ్మల్ని బెదిరించినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు కదా నైని అని తిలోత్తమ అంటుంది. మీ గొడవలు ఆపండి నగలు ఎక్కడున్నాయి వెతకండి అని అందరూ వెళ్లి నగలు వెతుకుతూ ఉంటారు వెతుకుతున్నప్పుడు సుమన వాళ్ళ అమ్మ సంచిలో నగలు కనిపిస్తాయి. చూశారా మా అమ్మే దొంగతనం చేసింది ఆవిడను అందుకని ఇంట్లోకి రానివద్దంటే మీరు ఎవరు వినలేదు కదా అని సుమన అంటుంది.

సుమన మీ అమ్మ దొంగతనం చేయడానికి ఇక్కడికి రానవసరం లేదు విశాలాక్షమ్మ గుడి తాళాలే వాళ్ళ దగ్గర ఉంటాయి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడు నిందలు వేయడం కాదు అని విశాల్ అంటాడు. నువ్వు ఇంకా ఏమీ మాట్లాడకుండా ముందు లోపలికి వెళ్ళు అని విక్రాంత్ సుమన ని అంటాడు. ఉలోచినీ ఇటివ్వు లేదంటే తనను కూడా సంచిలో వేసుకొని వెళ్ళిపోతావు అని సుమన పాపని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. కొద్దిసేపు ఆగితే అదే జరిగేది అని విశాలాక్షి అంటుంది. ఇక నువ్వు ఆపుతావా నీవల్లే ఇంక వీళ్ళు నన్ను చిన్నచూపు చూస్తున్నారు అని వాళ్ళ అమ్మ కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే విక్రాంత్ సుమన దగ్గరికి వచ్చి నువ్వే మీ అమ్మ సంచిలో నగలు పెట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని చూసావు కదా అని అంటాడు. నేనెందుకు అలాంటి పని చేస్తాను గుడిలో వేసే దక్షిణ సరిపోవట్లేదని ఈ నగలు సైలెంట్ గా కొట్టేసి వాటిని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడుపుకుందామని అమ్మ చూసి ఉంటుంది అని సుమన అంటుంది.

నీ కన్నతల్లి మీద నీకు ఎంత నమ్మకం ఉంది నువ్వు ఇంకా ఇలాగే మాట్లాడితే నీ మొహం ఎర్రగా అవ్వడం కాదు నీ ఒళ్లంతా ఎర్రగా అయ్యేలా కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టిన ఏం లాభం నీకు బుద్ధి రాదు కదా అని విక్రత్ వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చాడు ఏం మాట్లాడాడు ఆయనకు మెంటలా నాకు మెంటలా ఏమీ అర్థం కావట్లేదు అని సుమన అనుకుంటుంది. సుమన వాళ్ళ అమ్మ విశాలాక్షి దగ్గరికి వచ్చి ఇటు చూడు నిన్నే పిలుస్తున్నాను అని అంటుంది. నేను నీ వైపు తిరిగి చూడనక్కర్లేదు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు నాకు అర్థమైంది ఏంటో చెప్పు అని విశాలాక్షి అంటుంది. అటుగా వెళుతున్న నైని ఏంటి వీళ్లిద్దరూ ఏవో మాట్లాడుకుంటున్నారు అని నిలబడి చూస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది