NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani Today Episode April 10 2024 Episode 1209: నగలు కొట్టేసిన దొంగ నైని అని తనని తోకతో కట్టేసిన హనుమంతుడు.

Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights

Trinayani Today Episode April 10 2024 Episode 1209: హనుమంతవల పూజ 40 రోజులు చేసింది నైని అమ్మ తను ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది అని ఎద్దులయ్య చెబుతాడు. మాక్క కోరుకోవాలా మేం కోరుకోకూడదా అని సుమన అంటుంది.నువ్వేం కోరుకుంటావో మాకు తెలుసులే నీ అతి కోరికలు నువ్వు అని విక్రాంత్ అంటాడు. నైని ఈ నలభై రోజుల పూజ ఫలించడానికి నువ్వేం కోరుకుంటే అది జరుగుతుంది కోరుకో అమ్మ అని గురువుగారు అంటారు. నైని గాయత్రీ దేవి అమ్మగారు ఎక్కడ ఉన్నా తిరిగి రావాలని కోరుకుంటుంది అని  అంటుంది. అలా కోరుకో వద్దు అని విశాల్ అంటాడు. ఎందుకు బాబు గారు అని నైని అంటుంది. విశాల్ గాయత్రీ దేవి పుట్టి సంవత్సర నర అయినా ఇంకా ఇంటికి రాలేదని అందరూ టెన్షన్ పడుతుంటే నువ్వు అలా కోరుకోవద్దంటావేంటి అని లలితా దేవి అంటుంది.

Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights
Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights

అమ్మనగలు పోయాయని నైని చెప్పింది ఆ నగలు దొరికేలా కోరుకోమని చెప్పమ్మా అమ్మ నగలు పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అని విశాల్ అంటాడు. నువ్వు చెప్పినట్టే నైని కోరుకుంటుంది లే బాబు అని గురువుగారు అంటారు.అంతకంటే ముందు ఉగాది పచ్చడి స్వీకరించండి అని లలితా దేవి అంటుంది. గురువుగారు అందరికీ ఉగాది పచ్చడి పెడతాడు. నైని ఆ నగలు కొట్టేసిన దొంగ ఎవరు తెలియాలి ని కోరుకో అని గురువుగారు అంటారు. ఇప్పుడే చెప్తున్నాను ఎవరు కొట్టేశారో ముందు తెచ్చి పెట్టండి దొరికిన తర్వాత మాత్రం దొంగ నేను కాదని తప్పించుకోవద్దు అని లలితాదేవి అంటుంది.

Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights
Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights

ఎవరు కొట్టే లేదు అన్నట్టుగా అందరూ అలాగే నిలబడి చూస్తారు. నైని కోరుకో అమ్మ అని గురువుగారు అంటారు. స్వామి నీ పూజ 40 రోజులు చేసి గాయత్రీ దేవి అమ్మగారు జాడను తెలుసుకోవాలి అనుకున్నాను కానీ ఆవిడ నగలు పోయాయి అవి కొట్టేసిన దొంగ ఎవరో చూపించు అని నైని మొక్కుకుంటుంది. అలా ముక్కుకుంటే దొంగ ఎవరో తెలుస్తుందా అని సుమన అంటుంది.  హనుమంతుని మాయ వాళ్ళ పెద్ద గాలి మొదలవుతుంది. గాలి మొదలైంది అంటే ఎవరికో మూడింది అని హాసిని అంటుంది. ఏంటి దొంగ దొరికినట్టేనా అని సుమన అంటుంది. స్వామి వారి పటం కెళ్ళి చూడండి ఆయన వాళ్లమే ఆ దొంగని పట్టిస్తుంది అని గురువుగారు చెప్పి నమస్కారం పెట్టుకుంటారు.

Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights
Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights

హనుమంతుని మాయ శక్తితో తోక వచ్చి నైని ని చుట్టుముడుతుంది. అది చూసిన అందరూ షాక్ అయిపోతారు. చెల్లి నగలు తీసింది నువ్వా అని హాసిని అంటుంది. ఆ నగలు సరిపోకపోతే ఇంకొన్ని నగలు ఇస్తారేమో అని కొట్టేసిందేమో  మా అక్క అని సుమన అంటుంది. నోరు ముయ్ అని విక్రాంత్ అంటాడు. నైని ఆ నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అని విశాల్ అంటాడు. నైని గాయత్రీ దేవి ఫోటో వంకా చెయ్యి చూపెడుతుంది. విశాల్ వెళ్లి ఆ నగలు తీసుకొస్తాడు.నైని అమ్మ నగలు నువ్వు దాచి పెట్టావా అని విశాల్ అంటాడు. దొంగతనం చేయలేదు దాచి పెట్టింది చెల్లి అని హాసిని అంటుంది. మీరందరూ మాటలతోనైని బాధించకండి నైని ఆ నగలు ఎందుకు దాచి పెట్టావో చెప్పమ్మా అని లలితాదేవి అడుగుతుంది.చెప్పు నైని అని విశాల్ అంటాడు. గాయత్రీ దేవి అమ్మగారు పుట్టి సంవత్సరం నార అయినా తను ఇంటికి తిరిగి రాలేదు గాయత్రి పాపకి ఆస్తంతా వచ్చింది అప్పుడేనా ఇంటికి వస్తుందనుకున్నాను ఇంకా రాలేదు ఈ నగలు దాచిపెడితే నైనా అమ్మగారు ఇంటికి వస్తారని ఆశపడ్డాను అని నైని బాధపడుతుంది.

Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights
Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights

లలితాదేవి నైని దగ్గరికి వచ్చి నీ గుండెల మీద నగలు వేయాలనుకున్నాను కానీ నీ గుండెల వెనుక ఉన్న బాధని కనిపెట్టలేకపోయాను వాళ్లు వీళ్లు వెతుకుతారని కాదు నీకు నేను మాటేస్తున్నాను గాయత్రీ దేవిని నేను వెతికి తీసుకు వస్తాను అంటూ లలిత దేవి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, హాసిని మా అమ్మ ఇంటికి వస్తుంది హారతి తీసుకురా అని వల్లభ అంటాడు. నేను పచ్చడి తీసుకొస్తాను అంటూ నైని  వెళ్తుంది. అలా రెస్పాండ్ అవ్వాలి నువ్వు ఉన్నావు ఎందుకు అని వల్లభ అంటాడు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీ అమ్మ వస్తుంది చూడు అని హాసిని అంటుంది. తిలోత్తమా చేతిలో బ్యాగు పట్టుకొని కళ్ళకు అద్దాలు పెట్టుకొని వస్తూ ఉండగా వల్లభ ఎదురెళ్లి హగ్ చేసుకుందామని అనుకునే లోపు హాసిని పరిగెత్తుకెళ్ళి హగ్ చేసుకోబోతుంది దానితో ముగ్గురు కింద పడిపోతారు.

Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights
Trinayani Today Episode April 10 2024 Episode  1209 highlights

ఏంటే ఇలా పడేసావులే మీది నుంచి అని తిలోత్తమ అంటుంది. పావన మూర్తి వల్లభని లేకపోయి తను కూడా వాళ్ళ మీద పడిపోతాడు. పచ్చడి తీసుకువచ్చిన నైని విళ్ళు ఎక్కడికి వెళ్లారు అని చూసేసరికి కింద పడి ఉంటారు. ఏంటి ఇలా పడిపోయారు అని నైని పావన మూర్తిని లేపుతుంది. కింద ఉంది మన అత్తయ్య కదా చెల్లి టేక్ ట్ జీ అని హాసిని అంటుంది. అందరూ పైకి లేస్తారు.అత్తయ్యమీరు ఇంటికి వచ్చారని నోరు తీపి చేద్దామని  ఉగాది పచ్చడి తీసుకువచ్చాను తీసుకోండి అని నైని అంటుంది. చెయ్ కూడా కడుక్కోలేదు నైని అని తిలోత్తమ అంటుంది. పర్వాలేదా అత్తయ్య మీరు ఈ సంవత్సరం అంతా బాగుండాలని మొక్కుకొని తీసుకు వచ్చాను స్పూనుతో పోస్తాను తాగండి అని తిలోత్తమకి స్పూన్ తో ఉగాది పచ్చడి నోట్లో పోస్తుంది. చాలా థాంక్స్ నైని అని తిలోత్తమ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella