Trinayani November 02 Episode 1074: నైనీ కట్టిన దారం విశాలాక్షి కాలుకు తగిలి ఆగిపోతుంది. ఏంటమ్మా ముందుకు వెళ్లట్లేదు ఆగావు ఏంటి అని దమక్క అంటుంది. నైని కట్టిన దారం నాకు బంధమై నన్ను అడుగు వేయనీయట్లేదు అని విశాలాక్షి అంటుంది. ఏంటి అమ్మ ఎందుకు ఈ పని చేశారు అని దమక్క అంటుంది. ఏంటి దారం కట్టామని శాపం ఇస్తారా ఏంటి అది కట్టింది నేను కాదు నైని అని హాసిని అంటుంది. ఎందుకమ్మా ఈ దారం నా కాళ్లకు అడ్డంగా కట్టావు అని విశాలాక్షి అంటుంది. కొన్ని సమాధానాలు నాకు కావాలి అని నైని అంటుంది. ఇప్పుడు రాహుకాలం వచ్చింది సాయంత్రం నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని విశాలాక్షి అంటుంది.

ఏంటి దారంని విప్పేసాక వెళ్ళిపోదామని అనుకుంటున్నావా అని హాసిని అంటుంది. విశాలాక్షి మాట ఇచ్చింది కదా అక్క మాట తప్పి వెళ్లదులే అని దారం విప్పేస్తుంది. కట్ చేస్తే, వల్లభ అఖండ స్వామి దగ్గరికి వచ్చి స్వామి మా ఇంట్లో జరిగే అన్ని సంఘటనలకు నీ దగ్గర సమాధానం దొరుకుతుందని మా అమ్మ నన్ను పంపించింది అని వల్లభ అంటాడు. మీ ఇంట్లో తిరిగే విశాలాక్షి ఎవరు అని తెలుసుకోవడానికి ఇక్కడికి మీ అమ్మ పంపించింది కదా అని అఖండ స్వామి అంటాడు. అవును స్వామి అంతే అని వల్లభ అంటాడు. అయితే ఈ పౌడర్ తీసుకువెళ్లి మీ ఇంట్లో చల్లి విశాలాక్షి తొక్కేలా చేయి అప్పుడు ఆవిడ ఎవరో మీకు తెలిసి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని అఖండ స్వామి అంటాడు.

అలాగే స్వామి వెళ్ళొస్తాను అని వల్లభ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే, వల్లభ చెప్పింది నమ్మి విశాలాక్షి ఇక్కడికి వస్తుందంటావా అఖండ స్వామి ఇచ్చిన బూడిదిని ఇక్కడ చల్లాను విశాలాక్షి ఆ పౌడర్ మీద అడుగు వేస్తుంది అంటావా అసలు ఇక్కడికి వస్తుందా రాదా అని తిలోత్తమా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. వల్లభ విశాలాక్షి దగ్గరికి వెళ్లి మా అమ్మని ముందుగా ఎవరు టచ్ చేస్తే వాళ్ళకి 10,000 బెట్టు కడతాను మీరు పోటీలో పాల్గొంటారా అని అంటాడు. ఓ నేను రెడీ బాబు అని పావనమూర్తి అంటాడు. అయితే పరిగెడదాము అని వల్లభ అనగానే పావనమూర్తి దురంధర పరిగెత్తుకెళ్తారు. వల్లభ విశాలాక్షి దమక్క మాత్రం అక్కడే నిలబడ్డారు. ఏంటి మీరు పరిగెత్తలేదు అని వల్లభ అంటాడు.

నువ్వు పరిగెడితే నీ వెనకాల వద్దామని మేము నిలబడ్డాము అని విశాలాక్షి అంటుంది. దురంధర పావనమూర్తి పరిగెత్తికెళ్ళి పౌడర్ మీద కాలు వేసి జారీ త్రిలోత్తమ మీద పడతారు. రేయ్ నా మీద పడ్డారు ఏంట్రా లేవండి అమ్మ నా నడుము విరిగిపోయింది అని తిలోత్తమ అంటుంది. అందరూ పరిగెత్తుకు వచ్చి వాళ్ళను లేపుదామని ప్రయత్నిస్తారు. ఆ పౌడర్ మీద కాలేసి అందరూ జారీ తిలోత్తమ మీద పడతారు. అబ్బా వీళ్ళను లేపుదామని వచ్చి మీరు కూడా ఏంట్రా నామీద పడ్డారు చచ్చానురా దేవుడా అని తిలోత్తమ అరుస్తుంది. విశాల్ మెల్లగా అందరినీ లేపి నిలబెడుతాడు. అవును నేను చెప్పింది ఏంటి వల్లభ చేసిందేంటి మీరెందుకు పరిగెత్తుకొచ్చారు అని తిలోత్తమ అంటుంది.

ఎందుకు విశాలాక్షిని పిలుచుకు రమ్మని చెప్పావు అని విశాల్ అంటాడు. అందరి ముందు నన్ను ఎందుకు అవమానిస్తున్నావు అని అడగడానికి పిలిచాను అని తిలోత్తమ అంటుంది. తను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందని తెలియని వాళ్ళు ఇలాగే ఇబ్బందులు పడతారు అని విశాలాక్షి అంటుంది.అంటే వీళ్ళు మనుషులు కాదు కదమ్మా అందుకే ఎవరి గురించి ఆలోచించరు వాళ్లు మంచిగా ఉండడమే చూస్తారు ఇంకొకరు ఇబ్బంది చూడరు అని విక్రాంత్ అంటాడు. ఏంటి మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారా అని సుమన అంటుంది. మిమ్మల్ని పని కట్టుకొని అవమానించాల్సిన పనిలేదు మీరు చేసే పనులను బట్టి మీకు అవమానం జరుగుతుంది అని విశాల్ అంటాడు. అవునండి వీళ్లను పరిగెత్తమని మీరెందుకు అక్కడే ఆగిపోయారు వీళ్ళని ఏం చేద్దాం అని అనుకున్నారు వీళ్ళని కింద పడేసి దెబ్బలు తగిలితే చూసి ఆనందిద్దాం అనుకున్నారా అని హాసిని అంటుంది.

ఏ ఏంటే అంత నా మీదకి వెళుతున్నావు చేసింది అమ్మ అయితే అని వల్లభ అంటాడు. అమ్మ ఇదంతా ఎందుకు కానీ పౌడర్ ఇక్కడ ఎందుకు చల్లావు అని విశాల్ అడుగుతాడు. అలా అడగండి విశాల్ బాబు అని డమక్క అంటుంది. ఏమో అక్కడ ఎలా పడిందో నాకేం తెలుసు నన్ను అడుగుతారు ఏంటి అని తిలోత్తమ అంటుంది.వాళ్లలో వాళ్లు గొడవపడని మనకెందుకులే దమ్మక్క రా వెళ్దాము అని విశాలాక్షి వెళ్ళిపోతుంది. విశాలాక్షి వెళ్ళిపోతున్నప్పుడు తన అడుగులు పౌడరు మీద పడి పసుపు కుంకుమ తో తన అడుగులు పౌడర్ మీద పడతాయి. అది చూసినా నైని వెంటనే ఆ పాదాల మీద నీళ్లు పోస్తుంది. ఏంటి నైని ఇక్కడ నీళ్లు పోసావు ఎందుకు అని విశాల్ అంటాడు. తుడుస్తే పోతుందిలే బాబు పౌడర్ పడింది కదా కడుగుదామని పోసాను అని నైని అంటుంది. ఏంటి అక్క ఇలా నీళ్లు పోసావు పిల్లలు ఆడుకుంటు ఇక్కడికి వస్తే జారి కింద పడతారు కదా అని సుమన అంటుంది.

ఏ సుమ్మీ తుడిస్తే పోతుంది కదా వెళ్లి కర్ర తీసుకురా అని దురంధర అంటుంది. అలాగే అని సుమన కర్ర తీసుకురావడానికి వెళ్తుంది. కట్ చేస్తే,నైని విశాలాక్షి దగ్గరికి వెళ్తుంది.రా అమ్మ నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను అని విశాలాక్షి అంటుంది. నా అడుగుల చప్పుడు నీకు వినపడకపోయినా నా గుండెల్లో ఉన్న బాధ చప్పుడు నీకు వినపడి మాట్లాడుతున్నావా విశాలాక్షి అని అంటుంది. నువ్వు కనపడకపోయినా నీ రాక నేను గమనించగలను చెప్పు అని విశాలాక్షి అంటుంది. ఇప్పుడు వర్జ్యం లేదు అక్క కూడా నా పక్కన లేదు అని నైని అంటుంది. అలాగని అమృత ఘడియలు కూడా లేవు కదా అని విశాలాక్షి అంటుంది. నువ్వు మా అమ్మని దొంగని ఎందుకు చేశావు అని నైని అంటుంది. నైని ఏం మాట్లాడుతున్నావు విశాలాక్షి అలా ఎందుకు చేస్తుంది. నీకు తెలియదు విశాల్ బాబు గారు మా అమ్మ సంచిలో విశాలాక్షి నగలు వేసింది అని నైని అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది