Trinayani november 11 episode 1082: మీరు నన్ను తిట్టడం ఆపండి మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి ఊరికే ఏం చేసి పెట్టొద్దులే డబ్బులు ఇస్తాను అని సుమన అంటుంది. భర్త భార్యకి డబ్బులు ఇస్తే అది ప్రేమ భార్య భర్తకు డబ్బులు ఇస్తే కూలి అంటారు అయినా నన్ను నువ్వు భర్తగా ఎప్పుడు గుర్తింకున్నావు గనక నువ్వు డబ్బు మనిషివి కదా అని విక్రాంత్ అంటాడు. మీరు ఏదైనా అనుకోండి కానీ బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకో రండి అని సుమన అంటుంది. నీకు జబ్బు చేస్తే హాస్పిటల్ కి తీసుకెళ్తాను కానీ డబ్బులు మాత్రం తీసుకురాను నీ పాపపు సొమ్ములో నేను భాగం పంచుకోను అంటూ విక్రాంత్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే అమ్మ ఆ భూతద్దం ఎందుకు తెచ్చావు అని వల్లభా అడుగుతాడు. తాళపత్రాల మీద రాసి ఉంది కానీ కనపడట్లేదు ఎందుకంటే అవి ఎప్పుడూ 25 ఏళ్ల క్రితం రాసినవి కదా చెరిగిపోయి ఉంటాయా లేదంటే చిన్నగా రాయడం వల్ల కనపడట్లేదు ఈ భూతద్దం పెట్టి చూస్తే తెలుస్తుంది పద అని తిలోత్తమా పెట్టే దగ్గరికి వెళ్లి పెట్టే ఓపెన్ చేస్తుంది. అమ్మ ఎవరైనా చూస్తే బాగోదు అక్కడ గాయత్రి ఉంది చూడు అని వల్లభ అంటాడు.

అమ్మానాన్న అనే పిలువ లేని అనాధ పిల్ల అది మనలను ఏం చేస్తుంది రా అని తిలోత్తమా తాళపత్రాలు పట్టుకొని భూతద్దంతో చూస్తుంది. గాయత్రీ పాప డోర్ కట్టని గట్టిగా లాగడంతో అది ఊడిపోయి తిలోత్తమా తల మీద పడుతుంది. ఆ దెబ్బ తగిలి తిలోత్తమా కింద పడిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసిన వల్లభా నిశ్చయస్తుడై నిలబడి చూస్తూ ఉంటాడు. తిలోత్తమ అరుపులు విని అందరూ పరిగెత్తుకొస్తారు. ఏంటి అన్నయ్య అలా నిలబడి చూడకపోతే అమ్మను లేపొచ్చు కదా అని విశాల్ లేపి సోఫాలో కూర్చో పెడతాడు. ఇంతలో స్వామీజీ వచ్చి ఇది గాయత్రి పనేనా అని ఎద్దులయ్యను అడుగుతాడు. అవును స్వామి మీరే మేనేజ్ చేయాలి అని ఎద్దులయ్య అంటాడు. ఎలా కింద పడిపోయావు అని విశాల్ అడుగుతాడు.

గాయత్రీ పాప ఆ కర్టెన్లు లాగింది అది వచ్చి అమ్మ మీద పడి దెబ్బ తగిలింది అని వల్లభా అంటాడు. అన్నయ్య అది ఇద్దరు పట్టి లాగితే కానీ రాదు పాప ఎలా లాగుతుంది నువ్వు చెప్తే ఎవరైనా నమ్మాలి అని కోపంగా అంటూ విశాల్ వెళ్లి గాయత్రిని ఎత్తుకుంటాడు. నీకు అసలు తెలివి ఉండే మాట్లాడుతున్నావా అన్నయ్య అంత చిన్న పిల్ల ఈ డోర్ కట్టని ఎలా లాగుతుంది అని విక్రాంత్ అంటాడు అవును నేను నిజంగా చూశాను అదే జరిగింది ఆ పిల్ల అలా ఎందుకు చేసిందో అడగవే మమ్మీ అని వల్లభా అంటాడు. రేయ్ ఏదైనా పనికొచ్చే మాట మాట్లాడరా ఇంతకుముందు రెండుసార్లు ఈ పిల్ల వల్లనే దెబ్బలు తిన్నాను అని తిలోత్తమా అంటుంది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చవు అమ్మ అని విశాల్ అంటాడు. ఊరికనే వచ్చి నిలబడ్డాను అని తిలోత్తమా అంటుంది. మా వీళ్ళు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు అని వల్లభా అంటాడు. నైని చిన్న పిల్లని అలా అంటుంటే నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటావు ఏంటి తను ఎందుకు అలా చేస్తుందని అడగవా అయినా,అన్నయ్య నీకెందుకు ఈ చిన్న పిల్లఅంటే అంత అక్కసా అనుకుంటూ విశాల్ వెళ్ళిపోతాడు.

నువ్వేమీ శిలవు కాదు ఊరికే అలా నిలబడటానికి తాళపాత్రలు కనిపిస్తున్నాయి భూతద్దంతో చూస్తున్నావా ఎందుకమ్మా అబద్దాలు చెప్తావు అని విక్రాంత్ అంటాడు. అవున్రా దాంట్లో ఏం రాసిందో చూద్దామని భూతద్దం తెచ్చి చూడబోయాను దాంట్లో ఏం తప్పు ఉంది అని తిలోత్తమా అంటుంది. కనిపించిందా అత్తయ్య అని సుమన అంటుంది. లేదు బొక్క బోర్లా పడింది అని ఎద్దులయ్య అంటాడు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగుతుందేమో అని డమ్మక్క అంటుంది. మనుషులు ఎవరు చదవలేరు అని చెప్పాను కదా తిలోత్తమా అని స్వామీజీ అంటాడు. అది మనుషులు రాసినవే కదా స్వామి అని తిలోత్తమా అంటుంది. కట్ చేస్తే, నైని 25 సంవత్సరాల కిందట నీ తలరాతను రాసింది గాయత్రీ దేవి అని స్వామీజీ అంటాడు.

నా గురించి అమ్మగారికి ఎలా తెలుసు స్వామీజీ అంటే అమ్మగారికి జ్యోతిష్యం వచ్చా అని నైనా అంటుంది. ఇక్కడే పొరపాటు జరిగేది నైని జ్యోతిష్యం వేరు భవిష్యత్తు వేరు గాయత్రీ దేవి చేసిన పూజలకి ఆ విశాలాక్షి అమ్మ కరుణించి ప్రత్యక్ష దర్శనం ఇచ్చింది, అప్పుడు గాయత్రీ దేవి ఒక గాను ఒక కొడుకు అయినా విశాల్ గురించి అడగలేదు నా కొడుకుని పసిపిల్లల చూసుకునే భార్య దొరకాలి అని విశాలాక్షి ని అడిగింది అని స్వామీజీ అంటాడు. అంటే నేను పుట్టక ముందే నా గురించి అమ్మ గారు రాశారా మరి నాకెందుకు చెప్పలేదు అని నైని అడుగుతుంది. నీ గురించి రాసింది కానీ ఆ విశాలాక్షి అమ్మ గాయత్రీ దేవి రాసిన అంతసేపు బాగోద్వేగాలకు లోను కావడంతో గుర్తు ఉండదని రాసిన తాళపత్రాలు కనపడవు మాయమై పోతాయి అని అమ్మ చెప్పింది. అయితే ఇప్పుడు నా భవిష్యత్తు గురించి ఎలా తెలుసుకోవడం అని నైని అడుగుతుంది.

శివ భక్తులు అయినాఎద్దులయ్య వాళ్ళు చెప్పారు కదా నైని అని స్వామీజీ అంటాడు. స్వామీజీ గాయత్రీ పాప వాళ్ళ తిలోత్తమా అత్తయ్యకు ఏదో జరుగుతుంది అని నైని అంటుంది. నాకోసం ఆశ్రమంలో ఎదురుచూస్తూ ఉంటారు నైని నేను వెళ్ళిపోతున్నాను అంటూ స్వామీజీ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అమ్మ బాగా ఆలోచించు ఆ గాయత్రీ పాప వాళ్ళనే నీకు పరిస్థితి వచ్చింది అని వల్లభా అంటాడు. అమ్మానాన్న అంటే ఎవరో కూడా తెలియని అనాధ పిల్లలకి పెట్టెకి సంబంధం ఏంటి రా అని తిలోత్తమా అంటుంది. కాదమ్మా నాగులపురం వెళ్లి పెట్టే తెచ్చారు అది విప్పడానికి నాన్న తండాలు పడుతుంటే అఘోర స్వామి వచ్చి తాడును విప్పేస్తాడు అది చదువుదామని నువ్వు వెళ్లి దెబ్బలు తిన్నావు ఇదంతా ఆ గాయత్రి వల్లనే జరుగుతుందమ్మా అని వల్లభ అంటాడు. నువ్వు చెప్పావని భయపడిపోయి ఆ పిల్ల కుడి చేయిని కూడా తాకను ఏమీ కాలేదు నీ పిచ్చి మాటలు ఆపరా నువ్వు తిండికి తప్ప ఇంక దేనికి పనికిరావు అని తిలోత్తమా అంటుంది. మమ్మీ గాయత్రి పెద్దమ్మ అని నేను చెప్పట్లేదు కానీ గాయత్రీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అది నువ్వు గ్రహించట్లేదు అని వల్లభా అంటాడు. రేయ్ నువ్వు ముందు ఇకనుంచి వెళ్ళరా నాకు కోపం వస్తుంది అని తిలోత్తమా అంటుంది. మమ్మీ మంచి డైలాగ్ చెబుదాం అనుకున్నాను కానీ తర్వాత చెప్తాను అంటూ వల్లభ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నైని ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అని విశాల్ అంటాడు. ఏమీ లేదండి తిలోత్తమ అత్తయ్యకి గాయత్రి ఎలా దెబ్బ తగిలిలా చేసింది అని ఆలోచిస్తున్నాను అని నైని అంటుంది.నై ని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని విశాల్ కోపంగా అంటాడు. తిలోత్తమ అత్తయ్య పరిస్థితి చూశాక కూడా మీరు అలా అంటారేంటి బాబు గారు అని నైని అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది