NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani November 28 2023 Episode 1096: తాళ పత్ర గ్రంధంలో ఉన్న నిజం ఏంటో పెద్ద బొట్టమ్మ చెప్తుందా…

Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights

Trinayani November 28 2023 Episode 1096: ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచావో చెప్పమ్మ అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఏమీ లేదు పెద్ద బొట్టమ్మ ఉలోచిని కాసేపు ఎత్తుకుంటావని పిలిచాను అని నైని అంటుంది. అవునా అంటూ పెద్ద బొట్టుమ్మ ఉలోచిని ఎత్తుకొని సంబరపడిపోతుంది. కానీ నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి పెద్ద బొట్టమ్మ అని నైని అంటుంది. ఏంటో చెప్పమ్మ చేసి పెడతాను అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నాగులపురం నుంచి మేము ఒక పెట్ట తెచ్చాము కదా ఆ పెట్టెలో ఉన్న తాళపత్ర గ్రంథాలను నువ్వు చదివి పెట్టాలి అని నైని అంటుంది. పైనుంచి చూస్తున్న వల్లభ,నా పెద్ద మరదలు పెద్ద స్కెచ్ ఏ వేశావు అని గబగబ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్తాడు వల్లభ. చూడు నైని భవిష్యత్తు గురించి తెలిస్తే ప్రతిక్షణం బాదే తప్ప సంతోషం ఉండదు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. అదేంటో తెలిస్తే ఆపద ఎవరికో తెలుస్తుంది కదా పెద్ద బొట్టమ్మ అని నైని అంటుంది. సరే పదమ్మ నీ మాట నేనెందుకు కాదంటాను అని పెద్ద బొట్టమ్మ అంటుంది.

Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights
Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights

కట్ చేస్తే, అమ్మ అమ్మ అంటూ వల్లభ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్తాడు. ఒరేయ్ ఎందుకు రా అలా పరిగెత్తుకొస్తున్నావ్ నీకు అసలు ఏమైనా బుద్ధుందా నెమ్మదిగా రావచ్చు కదా అని తిలోత్తమ అంటుంది. నెమ్మదిగానే వద్దాము అనుకున్నా అని వల్లభ అంటాడు. నిన్ను నేను ఎక్కడికి పంపించాను నువ్వేం చేసావు అని అడుగుతుంది. పెద్ద మరదలు ఏం చేస్తుందో చూసి రమ్మన్నావు వచ్చాను అని వల్లభ అంటాడు. ఏం చూసావో అది చెప్పి చావు అని తిలోత్తమ అంటుంది. చూసావా అమ్మ నువ్వు కూడా నా చావే కోరుకుంటున్నావు అని వల్లభ అంటాడు. ఒరేయ్ నేను నీ చావు ఎందుకు కోరుకుంటాను రా నువ్వు నా కొడుకువి ఏం చూసావో ముందు అది చెప్పు అని తిలోత్తమ అంటుంది. ఎవరైనా వింటారేమో అని వల్లభ డోర్ గడియ పెట్టి అమ్మ పాము మనిషిగా మారిపోయింది అని అంటాడు. అంటే పెద్ద బొట్టమ్మ వచ్చిందా అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights
Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights

నువ్వు చాలా జీనియస్ మమ్మీ ఎలా కనిపెట్టావు అని వల్లభ అంటాడు. మాటలతో చంపకుండా ఏం జరిగిందో చెప్పరా అని తిలోత్తము అంటుంది.అదే మమ్మీ పెద్ద బొట్టమ్మకి ఉలోచిని ఇచ్చి తాళపత్ర గ్రంధాలు చదవమని నైని అంటుంది అని వల్లభ అంటాడు. మరి ఇంకా ఎందుకురా ఆలస్యం వెళ్లి సుమన దగ్గర ఈ మాట చెప్పు తనే వస్తుంది అప్పుడు పెద్ద బొట్టుమ్మ ఎలా ఆ తాళపత్ర గ్రంధాలు చదువుతుందో మనము చూద్దాం అని తిలోత్తమ అంటుంది. అమ్మ నువ్వు కిందికి హాల్లోకి వెళ్లి వాళ్ళని చెడుగుడు ఆడుకో నేను ఈలోపు చిన్న మరదలను తీసుకొని చిటికెలో వచ్చేస్తాను అని వల్లభ అంటాడు.కట్ చేస్తే,అందరూ హాల్లో నైని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి ఇంకా రావట్లేదు ఈలోపు సుమన వచ్చేస్తుందేమో అని విక్రాంత్ అంటాడు. శభాష్ అంటూ తిలోత్తమ చప్పట్లు కొట్టుకుంటూ వచ్చి నైనీ ఉలోచిని ఎత్తుకొని వెళ్లడం పెద్ద బొట్టమ్మ వచ్చి తాళపత్ర గ్రంధాలు చదవడం దానికి సుమన అడ్డుపడుతుందని తన కళ్ళకి గాయం చేయడం అంతా మీ ప్లాన్ భలే బాగుందిరా అని తిలోత్తమ అంటుంది. చెడ్డవాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటేనే బాగుంటుంది అని విక్రాంత్ అంటాడు. అమ్మ వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights
Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights

అందుకని సుమన కళ్ళల్లో కారం కొడతారా అని తిలోత్తమ అంటుంది. పుత్ర రాహుకాలం వచ్చేస్తుంది త్వరగా చదవమనండి అని డమ్మక్క అంటుంది. కట్ చేస్తే, వల్లభ సుమన దగ్గరికి వెళ్లి చిన్న మరదలా నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకొని పడుకున్నావు అక్కడ వాళ్లు ఎవరి పనిలో వాళ్లు మునిగిపోయి ఉన్నారు అని వల్లభ అంటాడు. బావగారు మీరు నా గదిలోకి ఎందుకు వచ్చారు అని సుమన అంటుంది. తను ఒక నవ్వు నవ్వి నేను ఎందుకు వచ్చానో చెప్పుకో మరదలా అని వల్లభ అంటాడు. అదే నేను అడుగుతున్నాను బావగారు మీరు ఒంటరిగా ఉన్న నా గదిలోకి ఎందుకు వచ్చారు అని సుమన పైట కొంగు కప్పుకుంటుంది. ఏ చిన్న మరదలా నేను అందుకోసం రాలేదమ్మ ఇప్పుడు నువ్వు కళ్ళు మాత్రమే మండుతున్నాయి అంటున్నావ్ కానీ తర్వాత నీ ఒళ్లంతా మండుతుంది అని వల్లభ అంటాడు. అంటే ఏంటి బావ గారు మీ ఉద్దేశం అని సుమన అంటుంది. నువ్వేమో ఇక్కడ పడుకున్నావు అక్కడ నీ ఉలోచిని పెద్ద బొట్టమ్మ ఒళ్ళో ఉంది అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights
Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights

ఇక్కడే నా గదిలోనే ఉండాలి కదా మా అక్క తీసుకు వెళ్లిందా అని సుమన గబగబ మంచం దిగి రాబోతుంటే కింద పడబోతుంది. అయ్యో చిన్న మరదలా అలా వెళ్ళకు కింద పడిపోతావు ఎత్తుకొని వెళ్దాము అంటే అంత బలం ఉన్న అది మంచిది కాదు చేయి పట్టుకుని తీసుకువెళ్తాను అంటే కుదరదు అందుకే నేను ఒక ప్లాన్ వేశాను ఈ కర్చిప్ కొస నువ్వు పట్టుకో ఇటు కొస నేను పట్టుకుంటాను నేను ముందు నడుస్తాను నువ్వు నా వెనకాల రా అని వల్లభ సుమనని తీసుకొని వెళుతూ ఉంటాడు. ఇక్కడ తాళపత్రాలు తెరిచేస్తున్నారు పిచ్చి నా కొడుకు ఏం చేస్తున్నాడు అని తిలోత్తమ అంటుంది. ఇంతలో నైని తాళపత్రాన్ని తీసి ఇది చదువు పెద్ద బొట్టమ్మ అని అంటుంది. అవి గాయత్రీ చేతిలో పెట్టండమ్మ అని పెద్ద బొట్టమ్మ అంటుంది. గాయత్రీ చేతికి ఎందుకు ఇవ్వాలి అని తిలోత్తమ అడుగుతుంది.

Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights
Trinayani Today Episode November 28 2023 Episode 1096 Highlights

అంటే అమ్మ చిన్న పిల్లలు దేవుడితో సమానం కదా తన చేతిలో పెడితే ప్రసాదం అనుకొని చదువుతుంది అని విశాల్ అంటాడు. నైనీ తాళపత్రాలు తీసి గాయత్రి చేతిలో పెడుతుంది. గాయత్రి పట్టుకోగానే అందులో అక్షరాలు పెద్ద బొట్టమ్మకి కనపడతాయి. గాయత్రీ దేవి జన్మ మారిన శత్రుత్వం మారదు ఆ శత్రుత్వం వల్లనే గాయత్రీ దేవికి ప్రాణగండం ఉంది అని పెద్ద బొట్టమ్మ గ్రంధంలో ఉన్నది ఉన్నట్టు చదువుతుంది. ఆ మాట వినగానే విశాల్ గుండెల్లో గుబులు పుడుతుంది. అందరూ షాక్ అయిపోతారు ఇంతలో వల్లభ సుమనని తీసుకొని వచ్చేస్తాడు.ఏ పెద్ద బొట్టమ్మ నా కూతుర్ని ఎందుకు ఎత్తుకున్నావు అని సుమన అంటుంది.

పెద్ద బుట్టమ్మ గ్రంధాలు చదివావు కదా ఇక వెళ్ళిపో అని డమ్మక్క అంటుంది. ఇచ్చి వెళ్తాను అని పెద్ద బొట్టమ్మ అంటుంది. హాసిని ఉలోచిని తిలోత్తమ గిచ్చి మనకు ఇవ్వమని చెప్తుంది. తిలోత్తమ తీసుకువెళ్లి సుమన చేతిలో పెడుతుంది.నా కూతుర్నే ఎత్తుకెళ్లిపోతావా అని సుమన తిలోత్తమ గొంతు పట్టుకుంటుంది. అందరూ షాక్ అయిపోతారు.తిలోత్తమ లాగి పెట్టి సుమన చంప మీద ఒకటి ఇచ్చి పిచ్చిదానా నా గొంతు నొక్కి పడతావేంటి అని అంటుంది. అత్తయ్య మీరా పెద్ద బొట్టమ్మ అనుకున్నాను అని సుమన అంటుంది. నువ్వు ఆ పని చేస్తావని తెలివిగా హాసిని నీ చేతికి ఉలోచిని ఇచ్చింది అని డమ్మక్క అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri