Trinayani October 18th ఎపిసోడ్ 1061: నైని నీకు అన్ని తెలుసు కానీ నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకే అర్థం కావట్లేదు అని విశాల్ అంటాడు. నా మీద కోపం వస్తుందా బాబు గారు అని నైని అంటుంది. బిజినెస్ లో మనకు శత్రువులు ఉన్నారంటే మనం ఎదుగుతున్నామని అర్థం కానీ ఇంట్లో శత్రువులు పెరుగుతున్నారు అంటే మన ఎదుగుదల వాళ్ళకి నచ్చట్లేదని అర్థం సుమనా నీకు సొంత చెల్లెలు తనకు నువ్వు చేసే పనులేవీ నచ్చట్లేదు అని విశాల్ అంటాడు. ఉలోచి కోసం పెద్ద బొట్టమ్మ రావడం చెల్లికి ఇష్టం లేదు బాబు గారు అని నైని అంటుంది. పాప కోసం పాము వస్తుంటే నువ్వు ఊరుకుంటున్నావు నైని ఇది నాకు నచ్చట్లేదు అని విశాల్ అంటాడు. మీరు పాముగానే చూస్తున్నారు కన్నతల్లిగా చూడట్లేదు బాబు గారు అని నైని అంటుంది. నన్ను పెంచి పెద్ద చేసిన అతిలోత్తమ అమ్మను కూడా నువ్వు అలాగే చూస్తావా అని విశాల్ అంటాడు.

చూడను అని నైని అంటుంది. ఎందుకలా తనేం చేసిందని విశాల్ అంటాడు. హత్య చేసింది అని నైని అంటుంది. ఏంటి నైని నువ్వంటున్నది ఏoటీ ఎవరిని హత్య చేసింది అమ్మ అని విశాల్ అంటాడు. అదే బాబు గారు నాగులయ్యని చంపేసింది తనకు పుట్టిన ఇద్దరు కొడుకుల వాళ్ళ తనకు ఆస్తిరాదేమోనని మీ డాడీ వాళ్లకు తండ్రి అవ్వాలని ఈ ఆస్టన్త తనకు చెందాలని మొదటి భర్తను చంపేసిందని నేను నమ్ముతున్నాను అని నైని అంటుంది. తిలోత్తమ అమ్మకి ఈ విషయం తెలిస్తే నీకు శత్రువులు పెరుగుతారని అది తెలుసుకొని మసులుకో అని విశాల్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నాలుగు రోజులు డేటింగ్ చేస్తే నువ్వే కనపడకుండా పోతావు అవును వదిన చేసిన వంట తిననని ప్రగాల్బాలు పలికావ్ అంట అని విక్రాంత్ అంటాడు. నాకేమీ అక్కర్లేదు మా అక్క వండిందే తిని మా అక్కనే తిడుతున్నానని హాసిని అక్క అన్నందుకు వద్దన్నాను అని సుమన అంటుంది.

తినకుండా అలాగే ఉండు అసలే పోతావు నాలుగు రోజులు అయితే మరిచిపోతాము అని విక్రాంత్ అంటాడు. హోటల్ కి వెళ్దామంటే ఇప్పుడు లేట్ అయిపోయింది అని ఆలోచిస్తున్నాను అని సుమన అంటుంది. అబ్బో ఎందుకు వెళ్లావు ఇప్పుడు కోటీశ్వరులు కదా అని విక్రత్ అయినా నువ్వు వెళుతుంటే ఊలోచి పాముగా మారి వెనకాల వస్తుందని నువ్వు వెళ్లట్లేదు అని వెటకారంగా విక్రాంత్ అంటాడు. చూసావు కదా మా నైని అక్క పెద్ద బొట్టుఅమ్మని పిలిచి ఉలోచని ఇద్దామని పక్క వీధిలో శ్రీమంతం ఉంది అని ఎంత డ్రామాలు ఆడిందో అని సుమన అంటుంది. వదినకు చెల్లెలు అన్న ఒకే ఒక కారణంతో నేను భరిస్తున్నాను లేదంటే ఎప్పుడూ బయటికి గెంటేసేవాన్ని అని విక్రాo త్ అంటాడు.అంటే ఇప్పుడు ఈ జీవితం కూడా మా అక్క ఇచ్చిందే అని సుమన అంటుంది. నేను చెప్పడం ఎందుకు నీకు అర్థం కావట్లేదా అని విక్రాంత్ వెళ్లిపోతాడు.

కట్ చేస్తే నైని కూరగాయలు కట్ చేస్తూ ఉండగా తిలోత్తమ వాళ్ళు వచ్చి గుడ్ మార్నింగ్ నైని అంటుంది. శుభోదయం అత్తయ్య గారు అని నైని అంటుంది. చూసావా మమ్మీ మరదలు ఎంత వెటకారంగా అంటుందో అని వల్లభ అంటాడు. అచ్చ తెలుగులో మాట్లాడితే నీకు వెటకారంగా ఉందా బావగారు అని నైని అంటుంది. అమ్మ అవన్నీ ఎందుకు నువ్వు దేనికోసం వచ్చావు విషయం చెప్పేసేయ్ అని వల్లభ అంటాడు. సరే నైని పాయింట్ కి వస్తున్నాను నువ్వు కన్నా గాయత్రి ఎక్కడ ఉందో మాకు తెలిసిపోయింది అని తిలోత్తమ అంటుంది. ఏంటి మమ్మీ మరదలు షాక్ అవ్వలేదు వ్వుతుంది అని వల్లభా అంటాడు. నేను నవ్వితే అందంగా ఉంటానని అంటారు బావగారు ఇంతకు మీరు టిఫిన్ చేశారా అని నైని అంటుంది. లేదు నైని ఇంకా తినలేదు నాకు పాలు కావాలి అని వల్లభ అంటాడు. రేయ్ వల్లభా నోరు ముయ్యారా అని తిలోత్తమ అంటుంది. అదేంటి మమ్మీ నన్ను తిడతావు అని వల్లభ అoటాడు. నేను గాయత్రి గురించి మాట్లాడుతుంటే నువ్వేమో టిఫిన్ చేశారా కాఫీ తాగుతారా అని అంటావేంటి నైని అని తిలోత్తమంటుంది.

మీకు తెలియదని నాకు తెలుసు కాబట్టి అలా అన్నాను అని నైని గాయత్రి ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది.కట్ చేస్తే స్వామీజీ అందరిని రమ్మని గట్టిగా పిలుస్తాడు. అందరూ వచ్చి ఏమైంది గురువుగారు అని అంటారు. నవరాత్రులు వస్తున్నాయి కదా నైని విశాలాక్షి చెప్పినట్టు జరుగుతుంది పసిపిల్లల కోసం ప్రాణ త్యాగం ఎవరు చేస్తారు అని స్వామీజీ అంటాడు.శివ భక్తురాలైన విశాలాక్షి అదే మాట చెప్పింది మన గురువుగారైన స్వామీజీ కూడా మన ఇంటికి వచ్చి అలాగే చెప్తున్నాడు అంటే కచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు ఏం చేద్దాం అని తిలోత్తమంటుంది. నన్ను కనకపోయినా పెంచిన మా అమ్మ తిలోత్తమ నాకోసం త్యాగం చేస్తుంది అని విశాల్ అంటాడు. తల్లులు మాత్రమే చెయ్యాలా తండ్రులు చేయకూడదా అలా చేస్తే మా ఆయనను ఇచ్చేదాన్ని పంతులుగారు అని హాసిని అంటుంది.

ఏయ్ గురువుగారు అంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు జోక్ చేస్తావేంటే అని వల్లభ అంటాడు. నా బిడ్డల కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం గురువుగారు ఏం చేయాలో చెప్పండి అని నైని అంటుంది. నైని విశాల్ కు నువ్వంటే చాలా ఇష్టం నీకేమైనా అయితే విశాల్ తట్టుకోలేడు ఆలోచించు అని తిలోత్తమ అంటుంది. నువ్వేం మాట్లాడవేంటి సుమన అని దూరందర అంటుంది. పగలంతా పాపగా ఉంటుంది నైట్ అయితే పాముగా మారుతుంది తన కోసం నేనే ఎందుకు త్యాగం చేయాలి అని సుమన అంటుంది. అంటే ఇన్నాళ్లు పాపని ప్రేమగా చూసుకుంటున్నదంతా డబ్బు కోసమేనా పాప కోసం కాదా ఛీ నీ బతుకు చెడ అని విక్రాంత్ అంటాడు.

బిడ్డల కన్నా తల్లి ఏమైనా చేయడానికి ముందుంటుంది కానీ మా కంటే పెద్దది అత్తయ్య ఉంది కదా అని హాసిని అంటుంది.అయినా నా కొడుకులు పెద్దవాళ్ళై పెళ్లి లై వాళ్ళు కూడా తండ్రులయ్యారు ఇంకా ప్రాణత్యాగం చేసే అవసరం నాకు ఎక్కడుంది అని తిలోత్తమ అంటుంది. ఓ అయితే నువ్వు లెక్కలో లేనట్టేనా అని హాసిని అంటుంది. చూడండి గురువుగారు నా బిడ్డల కోసం ఏమైనా చేస్తాను అని నైని అంటుంది. చెల్లి ప్రాణాలతో చెలగాటం ఎందుకైనా మంచిది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని హాసిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది