Trinayani October 28 Episode 1070: నువ్వు కనపడకపోయినా నీ మాటను బట్టి నువ్వు కోపంగా ఉన్నావు అని తెలుస్తుంది చెప్పండి ఏం కావాలి అని విశాలాక్షి అంటుంది. ఇందాక నువ్వు అలా మాట్లాడే సరికి అందరూ నన్ను అవమానించినట్టు మాట్లాడారు ఎందుకలా మాట్లాడవు నువ్వే కావాలని ఆ నగలు తీసి నా సంచిలో వేసావా ఏంటి అని నైనీ వాళ్ళ అమ్మ అంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పావమ్మా నేను సంచిలో వేస్తుండగా చూసావా ఏంటి అని విశాలాక్షి అంటుంది. అంటే నిజంగానే నువ్వే ఆ నగలు దొంగతనం చేసినా సంచిలో వేసావా ఎందుకిలా చేశావు అని నైని వాళ్ళ అమ్మ అంటుంది.

ఎందుకంటే దొంగగా నువ్వు బయటికి వెళ్ళవు హంతకురాలిగా వెళతావు కాబట్టి అని విశాలాక్షి అంటుంది. ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావ్ నేను హత్య చేయడం ఏంటి ఏదో పిల్లల్ని చూసుకుందాం అని వచ్చాను కానీ ఇలా నువ్వు నా మీద నేరం మోపుతున్నావేంటి అని నైని వాళ్ళ అమ్మ అంటుంది. నువ్వు పిల్లల్ని చూసుకుందాం అని వచ్చి వాళ్ళ పిల్లని లేకుండా చేద్దామని అనుకుంటున్నావు కదా అని విశాలాక్షి అంటుంది. ఇక ఆపుతావా నీ మాటలు నువ్వు ఇలా ఎందుకు చేసావు అని అడగడానికి వచ్చాను చూడు నాదే బుద్ధి తక్కువ నీ మాటలతో నాకు గుండెపోటు వచ్చేలా ఉంది నేను వెళ్లి పూజ చేసుకుంటే కాని మనసు ప్రశాంతంగా ఉండదు అని వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది.

విశాలాక్షి అలా మాట్లాడింది అంటే అమ్మ ఎవరిని చంపాలనుకుంటుంది అసలు అమ్మ ఎందుకు అలా చేస్తుంది తెలుసుకోవాలి అని తన మనసులో నైని అనుకుంటుంది. కట్ చేస్తే అందరూ పూజకు సిద్ధం చేస్తారు పూజ మందిరంలో కొచ్చి నిలబడతారు. విశాలాక్షి మహిషాసుర వద గురించి హాసినికి చెబుతూ ఉంటుంది. ఏ అమ్మాయి ఆ యుద్ధం గురించి నువ్వేదో చూసినట్టే చెప్తున్నావేంటి అది పిచ్చిది కాబట్టి వింటుంది అని దురంధర అంటుంది. నువ్వు ఉండు పిన్ని విశాలాక్షి కథ చెప్తుంటే చూసినట్టే అనిపిస్తుంది నువ్వు చెప్పు విశాలాక్షి అని హాసిని అంటుంది. నైని నువ్వు పాట పాడమ్మా నేను వీడియో తీస్తాను అని వల్లభ అంటాడు.అంటే మీరేనా వీడియోలు తీసి నాకు పంపిస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని హాసిని అంటుంది. ఏ నేను వీడియోలు తీసి నీకు పంపించడం ఏంటి నీకు పిచ్చిగాని పట్టిందా అని వల్లభ అంటాడు. వదిన ఏదో జోక్ చేసిందన్నయ్య అంతే కదా వదినా అని విశాల్ కవర్ చేస్తాడు. ఆ అంతే అంతే మీరేమంటారో నని జోక్ చేశాను అని హాసిని అంటుంది. చూడండమ్మా ఈ రోజైనా ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేద్దాము మీరు గొడవలు పడకండి అని పావన మూర్తి అంటాడు. ఈ టైంలో మా అమ్మ ఉంటే నీ సంగతి చెప్పేది అని వల్లభ అంటాడు. ఏం పాపం ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది బిక్షకు కానీ వెళ్లిందా ఏంటి అని హాసిని వెటకారం చేస్తుంది.

ఓయ్ మా అమ్మ ఇప్పుడు ఈ మాట వింటే నీ పళ్ళు రాలగొట్టేది ఏం మాట్లాడుతున్నావు అని వల్లభ అంటాడు. అవును అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ కనిపించట్లేదు అని నైని అంటుంది. అబ్బా ఎంత సేపు ఉన్నా మీ గొడవ మీదేనా పూజ మొదలు పెట్టేది ఏదైనా ఉందా అని విక్రాంత్ అంటాడు. సుమన ఉలోచి పాపని కూడా ఇక్కడ పడుకోబెట్టు అని నైని అంటుంది. సరే కానీ ప్రతిసారి పెద్ద మరదలే పాడుతుంది ఈసారి విశాలాక్షి పాట పాడాలి అని వల్లభ అంటాడు. అవును విశాలాక్షిపాడాలి అని అందరూ అంటారు. సరే నేను పాట పాడుతాను కానీ మీరు కళ్ళు మూసుకొని అమ్మవారిని మనసులో ధ్యానించుకోండి అని విశాలాక్షి అంటుంది. ఎందుకు మేం కళ్ళు మూసుకుంటే నువ్వు పారిపోదాం అనుకుంటున్నావా అని వల్లభ అంటాడు. అల్లుడు విశాలాక్షి అన్నది అమ్మవారిని మనసు నిండా నింపుకొని ధ్యానించమని చెప్పింది తను పాట పాడుతుంటే కోర్స్ కూడా చేయొచ్చు అని పావన మూర్తి అంటాడు.

అందరూ కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండగా విశాలాక్షి పూజ చేస్తూ అమ్మవారి కి స్తోత్రం పాట పాడుతుంది అలా పాడుతూ అమ్మవారి దగ్గర పెట్టిన గంధం తీసుకువచ్చి సుమన మొహం మీద చల్లుతుంది. అవును ఈ గారడి పిల్ల కళ్ళు మూసుకో మంటే నేనెందుకు మూసుకోవాలి అని వల్లభ కల్లు తెరిచి చూస్తాడు అప్పుడు విశాలాక్షి సుమన మొహం మీద గంధం చల్లుతూ కనిపించగానే ఏం చేస్తున్నావు సుమన మొహాన్ని అని గట్టిగా అరుస్తాడు వల్లభ. అప్పుడు సుమన అమ్మో నా కళ్ళు మండుతున్నాయి నా కళ్ళల్లో ఏం చల్లవు గారడి పిల్ల నన్ను చంపాలని చూస్తున్నావా లేదంటే నా కళ్ళు పోవాలి అనుకుంటున్నావా అని సుమన అంటుంది.

చూడు నైని మొహం మీద నీళ్లు చల్లు కళ్ళు మంటలు తగ్గుతాయి అని దురంధర అంటుంది. అలాగే అని నైని నీళ్లు తెచ్చి సుమన మొహం మీద చల్లుతుంది సుమన మొహం తుడుచుకుంటూ ఉంటుంది. విశాలాక్షి సుమన మొహం మీద గంధం చల్లమని నీకు ఎవరు చెప్పారు అని నైని అంటుంది. అప్పుడు విశాలాక్షి వల్లభవైపు చెయ్యి చూపెడుతుంది. అన్నయ్య నువ్వు చెప్పావా అని విశాల్ అంటాడు.ఏ నేనెందుకు అలా చేస్తాను రా నేను అక్కడికి పోనిదే అని వల్లభ అంటాడు. చూడు అన్నయ్య చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు అని విశాల్ అంటాడు. చూడు విశాలాక్షి నిజం చెప్పమ్మా నిజంగా ఎవరు నిన్ను ఈ పని చేయమన్నారు అని నైని అంటుంది. నేనెందుకు అబద్ధం చెప్తాను అమ్మ నేను అక్కడ కూర్చొని ఉంటే తను గంధం తెచ్చి నా చేతిలో పెట్టి తన మొహం మీద చల్లమని చెప్పాడు అని విశాలాక్షి అంటుంది.

అసలు నేను ఆ గంధాన్ని ముట్టుకోలేదు అని వల్లభ చేయి పైకి లేపగానే తన చేతికి గంధం అంటుకొని ఉంటుంది. నువ్వు గంధం తీయనిది నీ చేతికి ఎలా అంటుకుంది అన్నయ్య అని విశాల్ అంటాడు. నువ్వు ఆ గంధం విశాలాక్షికి ఇచ్చి మొహం మీద చల్లమని మంచి పని చేసావు అల్లుడు చూడు సుమన మొహం మంచిగా అయిపోయింది అని దురంధర అంటుంది. నిజంగానే సుమన మొహం బాగా అయిపోయింది అని అందరూ షాక్ అయిపోతారు. అవునా నా మొహం మునుపట్ల మారిపోయిందా అని చూసుకొని మురిసిపోతుంది సుమన.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది