Trinayani October 26 Episode 1068: అమ్మ ఆకుల్లో పిండి వంటలు వేయి కానీ ఇలా జోకులు వెయ్యకు అమ్మ అని పవన మూర్తి అంటాడు. ఇంకా పిండి వంటలు మొదలు పెట్టందే ఎలా వేయమంటావు బాబాయ్ అని హాసిని అంటుంది. అప్పటిదాకా నోరు ఊరించుకోవడం ఎందుకని అత్తయ్య తీసుకువచ్చింది అని విశాల్ అంటాడు. అత్తయ్య ఇక్కడే ఉంది కదా పిండి వంటలు ఎప్పుడు చేసింది అని వల్లభ అంటాడు. అత్తయ్య అంటే మేనత్త కాదు పిల్లనిచ్చిన అత్త అని పావన మూర్తి అంటాడు. అవునా అమ్మొస్తుందా బాబు గారు అని నైని అడుగుతుంది.

ఇదిగో మాటల్లోనే వచ్చేసింది అక్కయ్య అని పావని మూర్తి అంటాడు. మళ్లీ ఎందుకు వచ్చావు ఎవర్ని చంపడానికి వచ్చావు అని సుమన అంటుంది. అప్పుడు ఏదో అమ్మ తెలియక అలా చేసింది అని నైని అంటుంది.చిన్న కూతురికి పాప పుట్టిందని తెలిశాక వద్దామనుకుంటే రాలేకపోయాను పిల్లల పుట్టిన రోజు కైనా వద్దాము అనుకుంటే ఆయనకి ఒంట్లో బాగోలేదు అందుకే ఇప్పుడు చూసి వెళ్దామని వచ్చాను అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది ఆరోగ్యం అని నైని అంటుంది. బాగానే ఉన్నాడమ్మా అందుకే హైదరాబాద్ కి వెళ్లి పిల్లని చూసి వస్తాను అంటే ఈ గంధం ఇవ్వు అని ఇచ్చాడు అని గంధం తీసి నైనికి ఇస్తుంది.

అప్పుడు ఏదో ఒకటి చేసి నన్ను చంపాలని చూసావ్ ఇప్పుడు ఈ కొత్త నాటక మా గంధం ఇస్తున్నావ్ ముందు నువ్వు బయటికి నడువు అని సుమన అంటుంది. ఏంటి ఇందాకడి నుంచి చూస్తున్నాను పెద్ద ఆవిడ వినయ్ గా మాట్లాడుతుంటే బయటికి వెళ్ళమని అంటున్న ఎవరు అడిగే వాళ్ళు లేరా అని విశాల్ అంటాడు. కాదన్నయ్య తన్నేవాళ్ళు లేరని అలా మాట్లాడుతుంది అని విక్రాoత్ అంటాడు. రేయ్ కొట్టడం గొప్ప కాదురా తిట్టడం అంతకన్నా మంచిది కాదు నోరు జాగ్రత్త పెట్టుకుంటే ఏ గొడవ రాదు అని విశాల్ అంటాడు.అమ్మ అప్పుడు ఏ గాలి సోకి అలా చేసిందో కాని చెల్లి నిన్ను చంపాలని ఎందుకు చూస్తుంది అని నైని అంటుంది. అప్పుడు నాకు ఏ గాలి సో కింద ఏమో అలా చేశాను అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇప్పుడు ఏ గాలి సోకిందని వెళ్లిపోయావు ఇప్పుడు గాలి మళ్లీందని చూసి వెళదామని వచ్చావు ఇక వదిలేయి సుమన అని తిలోతమ అంటుంది.

నువ్వు నోరు మూసుకొని అడ్డం జరిగితే అత్తయ్య లోపలికి వెళుతుంది అని విక్రాంత్ అంటాడు. సుమన ఇక వదిలేసేయ్ మీ అమ్మని లోపలికి రాణి అని తిలోత్తమ అంటుంది. అంటే అత్తయ్య మీరు కూడా వదిలేయమంటున్నారా అని సుమన అంటుంది. ఎంతైనా మీ అమ్మే కదా సుమన పేగుబంధం తెలుసుకోలేక చూసి వెళ్దామని వచ్చింది ఊరుకో అని తిలోత్తమ అంటుంది. అమ్మ నువ్వు లోపలికి రా అని నైని వాళ్ళ అమ్మని లోపలికి తీసుకుని వెళుతుంది. అందరూ ఆవిడ తెచ్చిన పిండి వంటలు తిని చాలా బాగున్నాయి అని అంటారు. ఇంతలో మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి నైని ఎలా ఉన్నావ్ అని అంటుంది. అదేంటమ్మా ఇందాకే వచ్చావు కదా మళ్లీ ఎలా ఉన్నావ్ అని అడుగుతావేంటి అని నైని అంటుంది.

అంటే ఇందాక పిండి వంటలు తిన్నాం కదా బాగున్నాయో లేదో చెప్పలేదు కదా అందుకే అడుగుతుంది అత్తయ్య అని విశాల్ అంటాడు. లేదు బాబు నేను నిజంగానే ఇప్పుడే వస్తున్నాను అని నైని ఇవాళ అమ్మ అంటుంది.నువ్వు ఎప్పుడొచ్చా అంటావేంటి అత్తయ్య ఇంతకుముందు వచ్చింది ఎవరు అని విక్రత్ అంటాడు. కావాలంటే చూడండి బాబు చిన్న పాప కోసం దిష్టి పూసలు గిలక్కాయ కొనుక్కొని వచ్చాను చూడండి అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇందాక విశాలాక్షి అమ్మ వచ్చింది అని విశాలాక్షి అంటుంది. ఇదో కొత్త నాటకమా అని సుమన అంటుంది. లేదు నేను ఇప్పుడే వచ్చాను ఆ విశాలాక్షి అమ్మ మీద ఒట్టు అని వాళ్ళమ్మ అంటుంది. నా మీద ఒట్టు వేయకు అని విశాలాక్షి అంటుంది. నువ్వు ఏమన్నా దేవతవా అని తిలోత్తమ అంటుంది. మా అత్తయ్య ఒట్టు వేసింది దేవత అయిన విశాలాక్షి మీద అని వల్లభ అంటాడు. ఏదైతేనే బారం నామీద మోపినట్టే కదా అని విశాలాక్షి అంటుంది.

అబ్బ మమ్మీ ఏంటి గందరగోళం అని వల్లభ అంటాడు. ఒరేయ్ ఆగరా నాకే అర్థం కాక చస్తున్నాను అని తిలోత్తమ అంటుంది.ఏది ఒకసారి నా మనవరాలుని ఎత్తుకొని ఎవరి పోలికలు వచ్చాయి నాన్న పోలికల అమ్మ పోలికల అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇప్పుడు పోలికల గురించి పోల్చుకోవడం ఎందుకులే పిన్ని అని హాసిని అంటుంది. ఊళ్లో వాళ్ళు అడిగితే చెప్పాలి కదా అమ్మ అని వాళ్ళ పిన్ని అంటుంది. మీ అమ్మాయి పోలికలు వచ్చాయని చెప్పండ అత్తయ్య అని విశాల్ అంటాడు. విక్రాంత్ బాబు ఎప్పుడు ఊళ్లోకి ఎక్కువగా రాడు కాబట్టి తండ్రి పోలికలు వచ్చాయని తప్పించుకోవచ్చు అని నైని అంటుంది. అవును అచ్చం నాగులయ్య పోలికలే వచ్చాయి అని వాళ్ళ అమ్మ అంటుంది.

పోనీలే అమ్మ కదా అని జాలిపడి ఇంట్లోకి రానేస్తే ఇలాంటి మాటలు మాట్లాడతావా అందుకే నిన్ను రావద్దని అన్నాను అని సుమన అంటుంది. నేను ఎందుకు అలా అంటాను వాళ్ళ నాన్న పోలిక వచ్చింది అని అన్నాను అని వాళ్ళమ్మ అంటుంది. మేమందరము విన్నాము నువ్వు అన్నావు అని తిలోత్తమ అంటుంది. మీరేం మాట్లాడుతున్నారు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఆవిడ నాన్న పోలికలే అని మాట్లాడింది మీరే వేరే లాగా విన్నారు అని విశాలాక్షి అంటుంది. మేము అందరము విన్నాము నువ్వు మాట తప్పించుకోకు అని తిలోత్తమంటుంది. అమ్మ పాపకి దిష్టిపూసలు గిలక్కాయ తెచ్చాను అన్నావు కదా ఇవ్వు మరి ఆడుకుంటుంది అని విశాలాక్షి అంటుంది. అమ్మ ఇందాక నువ్వు సుమను కోసం గంధం తెచ్చానని అన్నావు అమ్మ కొంగులోనే ఉంది అది రాసుకుంటే సుమన మొహం మునుపట్ల మారిపోతుంది అని విశాలాక్షి. అంటుంది. ఏంటి అని అందరూ షాక్ అవుతారు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Jawan: అట్లీ ఎలాంటి వాడో ఓపెన్ గా చెప్పేసిన బిగ్ బాస్ సిరి హన్మంత్ !