Trinayani October 10 ఎపిసోడ్ 1054: అక్కను మోయాలంటే కొంచెం బలంగా ఉండాలి కదా మా విశాల్ అంటే కొంచెం బలంగా ఉన్నాడు కానీ వల్లభ ఎక్కడ మోయగలడు అని పావన మూర్తి అంటాడు.నా బాడీ ఎంతుందో చూపియమంటావా అని వల్లభ షర్టు ఇపబోతాడు. హలో ఐటెం రాజా ఇక్కడ చాలామంది ఆడవాళ్లు ఉన్నారు ఇక ఆపుతావా అని హాసిని అంటుంది.మీ గొడవ మీది గాయత్రి ఆట గాయత్రీ ది చూడండి ఎలా ఆడుకుంటుందో అని ఎద్దులయ్య అంటాడు. అవును ముగ్గురూ చాలా బాగా ఆడుకుంటున్నారు సుమన ఉలోచిని కూడా అక్కడ పడుకోబెట్టు పిల్లలతో ఆడుకుంటుంది అని నైని అంటుంది.

నా కూతుర్ని నేల మీద పడుకోబెట్టడానికి నా కూతురు ఏమైనా గతి లేనిది అనుకుంటున్నావా అని సుమన అంటుంది.విశాల్ బ్రో బిక్ష వేస్తే కోటేశ్వరరాలువు అయ్యావు ఊరికే అవలేదు అని విక్రాంత్ అంటాడు.రేయ్ నీ నోరు అదుపులో పెట్టుకోమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి రెచ్చగొట్టేది సుమన కాదురా నువ్వే అని విశాల్ అంటాడు. అలా చెప్పండి బావగారు ఇవ్వాల్సింది ఆయనేనా ని చెప్పండి అని సుమన అంటుంది. ముందు పెద్ద మాతని చెప్పనివ్వండి అని ఎద్దులయ్య అంటాడు. అమ్మ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని విశాల్ అంటాడు. ఏమీ లేదు విశాల్ దేవీ నవరాత్రులలో ఒక్కరోజు పసిపిల్లలకు పాలు దొరకవు అని విశాలాక్షి చెప్పింది కదా తను ఏది చెబితే అది జరుగుతుంది కాబట్టి ముందే మనం పిల్లలకి పాలు మానిపించేస్తే బాగుంటుంది అని తిలోత్తమా అంటుంది. అయితే ఊలోచి కి కూడా మానిపించిన అత్తయ్య అని సుమన అంటుంది.

ట్రై చెయ్ మానుతుందేమో చూద్దాం అని తిలోత్తమ అంటుంది. అసలు మీరు మనుషులేనా అని నలుగురు తిట్టిపోస్తారు అత్తయ్య అని నైని అంటుంది. నువ్వు గంట కొట్టు గాయత్రి అని ఎద్దులయ్య అంటాడు.నువ్వు మధ్య మధ్యలో ఎందుకు అలా అంటున్నావ్ అని దురంధర అంటుంది. అయ్యా ఎద్దులయ్యా నువ్వు కాసేపు ఊరుకో అని పావని మూర్తి అంటాడు. అమ్మ నువ్వు పూర్తి చేయమ్మా అని విశాల్ అంటాడు.గాయత్రీ గానవి పుండరీ నాద్ పండు ఫలము తింటారు కానీ ఉలోచి పాపా పాలు తప్ప ఇంకేమీ తినదు కదా అని హాసిని అంటుంది. తప్పదు హాసిని ఎందుకు అంటే విశాలాక్షి చెప్పినట్టు ఆ రోజు వస్తుంది అప్పుడు పిల్లలకు పాలు ఇవ్వలేకపోయామే అని గుండెలు బదుకునే కన్నా ఈ పని చేస్తే బాగుంటుంది కదా అని తిలోత్తమా మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుంది.

గాయత్రి గంటతో ఆడుకుంటూ గంటని విసిరేస్తుంది.అది చూసుకోకుండా తిలోత్తమా దాని మీద కాలు వేసి కింద జారి పడుతుంది. అమ్మ నీకేం కాలేదు కదా అందుకే అటు ఇటు నడవద్దు అన్నాను అని విక్రాంత్ అంటాడు. చూసుకోవాలి కదా అమ్మ అని విశాల్ అంటాడు. కాలుకు ఏదో తగిలినట్టు అనిపించింది అని తిలోత్తమ కిందికి చూస్తే గంట కిందపడి ఉంటుంది.గంట మీద కాలు పెట్టి జారీ కింద పడింది అక్క అని పవన మూర్తి అంటాడు. ఎన్నాళ్లకు కాలు జారిందో అని హాసిని వెటకారం చేస్తుంది. ముందు ఆ పిల్లను అనాలి అని తిలోత్తమ అంటుంది.అమ్మ తను చిన్నపిల్ల తనకేం తెలుసు అని అంటున్నావ్ అని విశాల్ అంటాడు. అత్తయ్య మీకే అర్థం కావట్లేదు కానీ మీరు కాలుజారి కింద పడ్డ లేపి నిలబెడితే స్ట్రెయిట్ గా నిలబడ్డారు మీ నొప్పులని పోయాయి చూసారా అని నైని అంటుంది.

నేను ముందే చెప్పాను కదా అమ్మ గాయత్రి పాపా గంటతో ఆడుకోదు వాడుకుంటుంది అని ఎద్దులయ్య అంటాడు. ఏదైతేనేం అమ్మ నీ కాళ్ల నొప్పులు పోయాయి ఇప్పుడు సంతోషించు అని విక్రాంత్ అంటాడు. గాయత్రి పాప మా అత్తయ్య కాళ్ళ కింద గంటను వేశావు కానీ అదే తలకు కొడితే బుర్ర రిపేర్ అయ్యేది అని హాసిని అంటుంది. నీ కుళ్ళు జోకులు వేయడం ఆపుతావా అని వల్లభా అంటాడు. నువ్వు ఊరుకోవే పిచ్చిదానా ఎందుకు అలా మాట్లాడతావు అని దురందర అంటుంది. మా బుజ్జి గాయత్రి రామా మనం వెళ్లి ఆడుకుందాం అని హాసిని గాయత్రి ని ఎత్తుకొని వెళ్లి సోపల కూర్చోబెట్టి నువ్వు అత్తయ్యని బాగు చేసావు అని అందరూ అనుకుంటున్నారు కానీ తనని చంపడానికి వచ్చినవని వాళ్ళకి తెలియదు అని హాసిని అంటుంది. ఏంటక్కా గాయత్రి తో ఏదో చావు గురించి మాట్లాడుతున్నావ్ అని సుమన అంటుంది. చిన్న పిల్లల దగ్గర అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతారా అని హాసిని అంటుంది.

నువ్వు మాట్లాడడం నేను విన్నాను అని సుమన అంటుంది. ఏమీ లేదులే చెల్లి అని గాయత్రి ని ఎత్తుకొని హాసిని వెళ్లిపోతుంది.కట్ చేస్తే తిలోత్తమ వాళ్ళు అఖండ స్వామి దగ్గరికి వస్తారు. నువ్వు ప్రాణగండం నుంచి ఎలా బయటపడి ఇలా వచ్చావు తిలోత్తమ అని అఖండ స్వామి అంటాడు. ఎందుకు స్వామి అలా అన్నారు అని తిలోత్తమ అంటుంది. అమ్మ నువ్వు కొంపదీసి ఆత్మవు కాదు కదా అని వల్లభ అంటడు. కిందపడి తలకు గాయమై ప్రాణాపాయ స్థితిలో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతున్నాను అని అఖండ స్వామి అంటాడు. కిందనే పడలేదు స్వామి దెబ్బ ఎలా తగులుతుంది అని తిలోత్తమ అంటుంది. అదేంటమ్మా పొద్దున గాయత్రి పాపా గంట కింద పడేస్తే గంట మీద కాలు పెట్టి కింద పడ్డావు కదా అని వల్లభ అంటాడు. అదా స్వామి చిన్న పిల్ల తెలియక చేసిన నేను కింద పడ్డ సరే నాకు మంచే జరిగింది దానికి కోపం పడకూడదు అని తిలోత్తమ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది