Trinayani October 11th ఎపిసోడ్ 1055: మృత్యువుని మెచ్చుకుంటావా తిలోత్తమ అని అఖండ స్వామి అంటాడు. స్వామి నాకు ఏమీ అర్థం కావట్లేదు చెప్పాల్సింది ఏదో సూటిగా చెప్పండి అని తిలోత్తమ అంటుంది. నిన్ను కాపాడినట్టే కాపాడి నీ ప్రాణాలను తోడేస్తుంది ఆ గాయత్రి పాప నిన్ను చంపడానికి పుట్టిన గాయత్రి అని అఖండ స్వామి అంటాడు. నైనికి పుట్టిన పిల్లని ఎవరో ఎత్తుకు వెళ్లారు విశాల్ నైని గాయత్రి ని దత్తత తీసుకున్నారు తను ఎలా నన్ను చంపగలుగుతుంది మీరు చెప్పేది నిజమా ఇప్పుడే వెళ్లి తాడోపేడో తేల్చుకుంటాను అని తిలోత్తమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే గాయత్రి ఫోటో కింద పడిపోతుండగా హాసిని పట్టుకుంటుంది.

ఆ ఫోటో కింద ఎందుకు పడపోయిందో గమనించారా మాత అని ఎదులయ్య అంటాడు. ఇదేంటి చెల్లి పెద్ద గాలి కూడా రాలేదు అత్తయ్య ఫోటో కింద పడబోతుంది అని హాసిని అంటుంది. గాలి వచ్చి కింద పడిపోయి ఉంటుందిలే అమ్మ అని పవన మూర్తి అంటాడు.కిటికీలు డోర్లు అన్ని వేసే ఉన్నాయి బయట అంత పెద్ద గాలి కూడా లేదు కానీ ఫోటో ఎందుకు కింద పడబోయింది ఏదో ప్రమాదం రాబోతుంది మాత అని ఎదులయ్య అంటాడు. అదేదో నీకేమైనా తెలుస్తుందా చెల్లి అని హాసిని అంటుంది.నాకు అలాంటి సంకేతాలు ఏమీ కనిపించట్లేదు అక్క అని నైని అంటుంది.

అలాంటివి ముందే తెలియవమ్మా జరుగుతుంటే చూడాల్సిందే అని ఎద్దులయ్య అంటాడు.కట్ చేస్తే ఏంటయ్యా అటు ఇటు చూసుకోకుండా హడావుడిగా వచ్చి నన్ను తగులుకున్నావు అని దురంధర అంటుంది. ఉపద్రవం రాబోతుంది మాత గాయత్రీ మాతనే కాపాడాలి ఎక్కడ ఉంది ఇవ్వండి నేను ఎత్తుకెళ్లి పోతాను అని ఎద్దులయ్య అంటాడు. ఇంతలో తిలోత్తమ వాళ్ళు ఇంటికి వస్తారు. అమ్మ ఎంత రిస్క్ చేయడం అవసరమంటావా అని వల్లభ అంటాడు. రేయ్ గాయత్రి పాపను ముట్టుకున్నాక మంటల్లో నేను తగలబడుతుంటే గాయత్రి ని కూడా ఎత్తుకొని అగ్నికి ఆహుతి చేస్తాను పునర్జన్మలో కూడా గాయత్రక్కను చంపే ఘనత నాకే దక్కింది అని తిలోత్తమా అంటుంది.అంత రిస్క్ చేసి పరీక్షించడం అవసరమంటావా అని వల్లభ అంటాడు. రేయ్ ఈరోజు ఈ ఇంట్లో నా చావన జరగాలి గాయత్రి అక్క చావన్న జరగాలి లేదంటే మా ఇద్దరి చావైనా జరగాలి నువ్వు ముందు రా అని తిలోత్తమ లోపలికి వెళుతుంది.

ఏంటి గాయత్రి పాపను ఎత్తుకొని బయటికి వెళ్తావా అంటే దొంగతనం చేస్తావా అని పావని మూర్తి అంటాడు. ఉలోచిని పెద్ద బొట్టం ఎత్తుకెళ్లినట్టు నీ కొడుకుని మా అక్క కూతుర్నే ఎత్తుకొని పోతాడేమో అని సుమన అంటుంది. ఎందుకు ఎద్దులయ్య అలా అంటున్నాడు అడిగి తెలుసుకుందాం అతని అపార్థం చేసుకోకండి నీకేమైనా కీడు జరుగుతుందని సంకేతం అనిపిస్తుందా ఎదులయ్య ఏమి మాట్లాడట్లేదు ఏంటి అని నైని అంటుంది. అమ్మ రాహుకాలం వెళ్లేదాకా పాపని బయట తిప్పి మళ్లీ తీసుకు వస్తాను అని ఎద్దులయ్య అంటాడు.అదిగో అమ్మ వాళ్లు వచ్చేసారు అని విశాల్ అంటాడు. అయితే సమస్య వచ్చినట్టే అని హాసిని అంటుంది. ఏంటి ఏదో అంటున్నారు అని తిలోత్తమ అంటుంది. ఏమీ లేదు అత్తయ్య గాయత్రీ ని బయటికి ఎత్తుకెళ్తానని ఎద్దులయ్య అంటున్నాడు అని సుమన అంటుంది. ఏమి అక్కర్లేదు ఈ ఇంట్లో ఎవరిదో ఒకరి చావు జరుగుతుంది అని తెలుసుకోవడానికి వెళ్ళాము అని తిలోత్తమ అంటుంది. అంటే ఎక్కడికి వెళ్లి తెలుసుకున్నారమ్మా అని విశాల్ అంటాడు.

పొద్దున్నే లేచి నిటారుగా నిలబడగానే కాళ్ళ కింద చక్రాలు వస్తాయి తల్లి కొడుకు ఒకచోట ఉండరు కదా ఎక్కడికో వెళ్లి వచ్చి ఉంటారు అని హాసిని అంటుంది.వల్లభ వెళ్ళి పిల్లని ఎత్తుకో అని తిలోత్తమా అంటుంది. అమ్మ నాకు భయం వేస్తుంది అని వల్లభ అంటాడు. నీ కొడుకుని ఎత్తుకున్నట్టే గాయత్రి ని కూడా ఎత్తుకో వల్లభ అని పావన మూర్తి అంటాడు. నా కొడుకుని ఎత్తుకుంటే ఏ ప్రమాదము జరగదు కానీ గాయత్రి ని ఎత్తుకుంటేనే ప్రమాదం వస్తుంది అని వల్లభ అంటాడు. ప్రమాదమా అని అందరు షాక్ అవుతారు.రేయ్ ఏమి జరగదు నువ్వు ముందు గాయత్రిని ఎత్తుకో అని తిలోత్తమ అంటుంది. అమ్మ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని విశాల్ అంటాడు. చూస్తారు గా విశాల్ ఒరేయ్ వల్లభ పాపని ఎత్తుకో అని తిలోత్తమ అంటుంది.వల్లభ భయపడుతూ పాపని ఎత్తుకుంటాడు. అమ్మ కంగారుగా బయటి నుంచి వచ్చి పాపని ఎత్తుకో అని బ్రో ని అంటున్నావ్ ఏం చేద్దామని విక్రాంత్ అంటాడు. ఏం చేస్తామే చెప్పేముందు మీకు ఒక విషయం చెప్పాలి వల్లభ ఎత్తుకున్నది ఎవరినో కాదు గాయత్రీ దేవిని అని తిలోత్తమ అంటుంది. గాయత్రి నా కన్నా బిడ్డ ఎవరో ఎత్తుకెళ్లిపోయారు అనుకున్నాను కానీ తిరిగి నా ఇంటికే వచ్చిందా బాబు గారు చూశారా అని నైని అంటుంది. మీరు కన్న బిడ్డ నే మీరు దత్తత తీసుకున్నారా ఇది ఏం విడ్డూరం అని దురంధర అంటుంది.

అవునా అమ్మ నీకు ఈ నిజం ఎలా తెలిసింది మీరు కలిసిన ఆ స్వామీజీ చెప్పాడా అని విక్రాంత్ అంటాడు. విశాల్ మాత్రం నిజం తెలిసిపోయింది అందరికీ అని టెన్షన్ పడుతూ ఉంటాడు.ఒక్క నిమిషం అందరూ ఆగండి జోగయ్య శాస్త్రి తన కూతురు శారదా కి పుట్టిన బిడ్డ అని చెప్పాడు అది తూచని వీళ్ళు చెబితే ఎందుకు నమ్మాలి పైగా మా ఆయన్ని మా అత్తని అస్సలు నమ్మకూడదు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని హాసిని అంటుంది.హాసిని అక్క చెప్పింది నూటికి నూరు బాలు నిజం అని సుమన అంటుంది. సుమన నువ్వు కూడా మమ్మల్ని నమ్మవా అని తిలోత్తమ అంటుంది. మిమ్మల్ని అనుమానించట్లేదు అత్తయ్య హాసిని అక్క చెప్పింది కరెక్టే ఎందుకంటే జోగయ్య శాస్త్రి మనవరాలు అయిన గాయత్రి విశాల్ బావని కన్న తల్లి అయిన గాయత్రీ దేవి ఎలా అవుతుంది పేరు ఒకటైనంత మాత్రాన తనే గాయత్రీ దేవి అవదు కదా ఎర్ర చీర కట్టుకున్నదేల్లా నా పెళ్ళామే అనే సామెత ఉన్నట్టు గాయత్రి పేరు ఉన్న ఈ గాయత్రి గాయత్రీ దేవి కాదు కదా మీరు అలా చెప్పగానే మా అక్క ఎమోషన్ అయిపోతుంది కానీ ఫోటోలో ఉన్న గాయత్రి అత్తయ్య ఈ అనాధ పిల్ల ఆయన గాయత్రి ఒకటి ఎలా అవుతుంది మీరు నాకు చెప్పండి అని సుమన అంటుంది. మీరు ఏ ఆధారం పట్టుకొని గాయత్రి ని గాయత్రి అక్క అని అంటున్నారు అని పవన మూర్తి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది