Trinayani October 23 Episode 1065: ఇక్కడ ముగ్గురు అమ్మలు ఉన్నా సరే పిల్లలకి పాలు పట్టలేకపోతున్నారు అని విశాల్ అంటాడు. ముగ్గురు తల్లులు ఉన్నా ఏం చేస్తారు విశాల్ విధిని తప్పించలేరు కదా పిల్లలకి పాలు దొరకాలి అంటే అమ్మే రావాలి… మీరు ప్రార్థించండి అని స్వామీజీ అంటాడు. అవును చెల్లి గురువుగారు చెప్పినట్టు మనం అమ్మవారిని ప్రార్థిద్దాం అమ్మే దిగి వస్తుంది అని హాసిని అంటుంది. ప్రార్థిద్దాం అక్క అమ్మనే గట్టిగా కాళ్లు పట్టుకొని అడుగుదాం మన బిడ్డలు ఆకలి తీర్చమని అని నైని అంటుంది. మనం ఎంత ప్రార్ధించిన అమ్మ రాకపోతే ఏం చేస్తాం అక్క పిల్లలు ఆకలితో అలమటించాల్సిందేనా అనే సుమన అంటుంది.

నువ్వేం కంగారు పడకు సుమన అమ్మని ప్రార్థిస్తే ఇవ్వలేని ది అంటూ ఏమీ ఉండదు అని నైని అంటుంది. మా ఇంకా పొద్దుపోతుంది పిల్లలుకి ఆకలేస్తుంది మీరు కాలాన్ని వృధా చేయకండి అని ఎదులయ్య అంటారు. నైనీ హాసిని సుమన అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించి పూజించి అర్చించి హారతి ఇచ్చి వేడుకుంటారు అమ్మ నువ్వు తప్ప పిల్లల్ని ఇంకెవరు రక్షించలేరు నీవే దిక్కు పిల్లల్ని చంపినా, ఆకలి తీర్చినా, నీదే రక్ష పాహిమాం పాహిమాం దేవి నిన్ను అడిగినంత మాత్రం చేతనే కోరిన వరాలు ఇచ్చే తల్లివి ఈ పసిబిడ్డల ఆకలి తీర్చు అని నైని ప్రార్థిస్తుంది. అమ్మ పెద్ద మరదలు ఇంతసేపు అమ్మవారిని పూజించి పాట పాడింది దానికి నా భార్య వీడి భార్య కలిసొచ్చారు కానీ ఏం జరిగింది అని వల్లభ అంటాడు. గాలి వచ్చింది రా అటు ఇటు తలుపులు కొట్టుకుంటూ పూలు ఎగిరిపోతూ గాలి వచ్చింది కానీ అమ్మవారు మాత్రం రాలేదు అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది తిలోత్తమ.

దేనికైనా టైం పడుతుంది ఎందుకు అలా మాట్లాడతారు అని విశాల్ అంటాడు. ఏదిరా మరి ఇంతసేపు వీళ్ళు ఇంతలా అరిచారు కదా ఆ మోరైనా విని రావాలి కదా మరి రాలేదేంటి మీ అమ్మవారు అని వల్లభా అంటాడు. అదిగో అమ్మ వస్తున్న శబ్దం వినపడుతుంది నైని నీకు వినపడట్లేదా అని డమఅక్క అంటుంది. అవును చెల్లి ఇంతసేపు మనం పిలిచిన అమ్మ రాలేదు ఇక వస్తుందని నమ్మకం కూడా లేదు అని హాసిని అంటఉండగా అదిగో అక్క అమ్మ వస్తున్నట్టు అనిపిస్తుంది నీకు తెలియట్లేదా చూడండి అని నైని అనగానే అమ్మవారి విగ్రహం మాయమై అమ్మవారి ప్రత్యక్షమవుతుంది. అందరూ అమ్మవారిని చూసి షాక్ అయిపోయి అలాగే నిలబడి పోతారు. అమ్మ ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నాకు ఈ రోజు ప్రత్యక్షమయ్యావు ఈ పసిపిల్లల ఆకలిని తీర్చమ్మ అని నైని అంటుంది.

అమ్మ ఇది కాదా పూర్వజన్మ సుకృతం అంటే ఇది కాదా నేను చేసిన పుణ్యాలకి ఫలితం హిమాలయాల్లో ఎన్నో ఏళ్ల నుంచి తపస్సు చేసిన కనిపించిన నీవు మాకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చావు ఇది కలా నిజమా అనుకుందాము అంటే నిజంగానే మాకు కనపడుతున్నావు చాలమ్మా ఈ జన్మకి ఇది చాలు ధన్యులం అయిపోయాము అనే విశాల్ అంటాడు.అమ్మ చాలా చేపట్నుంచి పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. పిల్లలకు పాలను ప్రసాదించి వాళ్ళని అనుగ్రహించమ్మా అని హాసిని అంటుంది. అమ్మ చిరునవ్వుతో బిడ్డలని దగ్గరికి తీసుకొని వాళ్ల ఆకలి తీరుస్తుంది.నిత్యం ఏ త్రిమూర్తులు నిన్ను ప్రార్థించి నీ కాలు దుమ్మునే వాళ్ళను నుదుటిన బోటులాగా పేటుకుOటరో అటువంటి తల్లి మా ఇంట ప్రత్యక్షమయ్యావు ఆ పరమశివుడు కూడా నిన్ను తలుచుకోకుండా లయకారకుడు కాడట బ్రహ్మదేవుడు సైతం సరస్వతిగా నీవు ఉండి సృష్టిని చేయిస్తావట విష్ణుమూర్తి నీ అనుగ్రహం పొంది ప్రాణకోటిని పోషిస్తాడట అలాంటివారు ప్రార్ధించితేనే కనిపించలేని నువ్వు మా ఇంట ప్రత్యక్షమై మా బిడ్డలకు పాలను ఇచ్చి వాళ్ళ ఆకలి తీర్చి మమ్ములను అగ్రాహిచవు తల్లి పాహిమాం పాహిమాం అని నైని అంటుంది.

అవును తల్లి ఉదయం పూట పార్వతీదేవిగా మధ్యాహ్నం పూట లక్ష్మీదేవిగా సాయంత్రం పూట సరస్వతి దేవిగా నేను త్రిమూర్తులు అర్చించి పూజిస్తారు నీవు మాకు దర్శనమిచ్చావు అంటే మా పూర్వజన్మ సుకృతం కానీ అమ్మ ఈ పసిబిడ్డలని ఈ స్థితికి తీసుకు వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పమ్మా పాహిమాం పాహిమాం అని హాసిని అంటుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి వచ్చాను వాళ్లని ఈ స్థితికి తిసు కు వచ్చిన వాళ్ళని శిక్షించడానికి రాలేదు ఏదైనా విదిలికితమే కానీ దాన్ని ఎదిరించి నిలవడం ఎవరి తరము కాదు కాలానికి అనుగుణంగా నడుచుకుపోవాల్సిందే అనే విశాలాక్షి అంటుంది. తిలోత్తమ వల్లభ మాత్రం అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతారు. అందరూ అమ్మవారిని పాహిమాం పాహిమాం అనే అంటూ ఉండగా అమ్మ మాయమైపోతుంది. వల్లభ కూడా అమ్మ పాహిమాం పాహిమాం అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అన్నయ్య నీకేమైంది అని విశాలంటాడు.ఒరేయ్ వల్లభా కళ్ళు తెరవ రా ఏమైంది రా నీకు ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా అని కంగారుపడుతూ తిలోత్తమ అంటుంది.
Trinayani ఎపిసోడ్ 1064: తినడం మానేసిన పిల్లలు…విశాలాక్షి అమ్మవారిని సహాయం కోరి నిద్ర లేపిన త్రినయని!

పాపాత్ములకి అమ్మవారిని చూస్తే భయం వేస్తుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడేమో చెల్లి అమ్మని చూడలేక అని హాసిని అంటుంది. ఏమైంది బావగారు మీకు అమ్మవారు మన వెంట ఉండగా ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఆవహించలేదు కదా అని నైని అంటుంది. అమ్మ మమ్మీ అమ్మవారు ఇంట్లో ఉన్నందుకే భయం ఎప్పుడు చంపేస్తుందోనని వల్లభ అంటాడు. మమ్మీ అనకుండా అమ్మ అనే అమ్మను వేడుకున్నావు కదా వల్లభ అందుకే నిన్ను రక్షించింది చంపలేదు అని డమ్మఅక్క అంటుంది. కట్ చేస్తే త్రిలోత్తమ వాళ్ళు అఖండ స్వామి దగ్గరికి వెళ్లి స్వామి అమ్మవారు వచ్చి పిల్లల ఆకలి తీర్చింది ఏంటి ఈ వింత నిజంగానే ఇలా జరిగిందా కళ్ళ ముందు అదంతా జరిగినా నమ్మలేకుండా ఉన్నాను స్వామి అనే తిలోత్తమ అంటుంది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నీకు అమ్మవారి దర్శనం అవ్వదు తిలోత్తమ కానీ పాపాత్ములు రాలివైన నిన్ను కూడా అమ్మవారు అనుగ్రహించింది అని అఖండ స్వామి అంటాడు. స్వామి అమ్మవారు వచ్చింది బాగానే ఉంది కానీ ఆమెను చూస్తే నాకెందుకు భయం వేసి కళ్ళు తిరిగి కింద పడిపోయాను ఆమె నన్ను చంపేస్తుందేమో అని భయం వేసింది అని వల్లభ అంటాడు. హిమాలయ ప్రదేశాలలో ఏనో సంవత్సరాలు తపస్సు చేసి ఉంటారు మునీశ్వరులు వాళ్లకు లభించని అదృష్టం మీకు దొరికింది మీ పూర్వజన్మ సుకృతం అని అఖండ స్వామి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.