Trinayani October 25 Episode 1067: వల్లభ అనగానే నిజంగానే ఏం చేస్తున్నారా అని తొంగి చూస్తే విశాల్ హాసిని ఇద్దరు మాట్లాడుకుంటు కనిపిస్తారు ఏంటిరా వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అని తిలోత్తమ అంటుంది. అదే అమ్మ మనం మాట్లాడేటప్పుడు నా భార్య ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది కదా దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఏమై ఉంటుంది అంటావు అని వల్లభ అంటాడు. ఏమో అది విందాం ముందు ఏం చేస్తారో ఏం మాట్లాడుకుంటారు అని తిలోత్తమ అంటుంది. వదిన ఎవరు ఈ పని చేసి ఉంటారు మనం హాల్లో ఉండగానే ఆ నెంబర్ ఎవరిది అని చెక్ చేసి ఉండాల్సింది అప్పుడు తెలిసిపోయేది ఎవరు అని విశాల్ అంటాడు. అక్కడ చెక్ చేస్తే దొరికిపోతామో ఏమోనని భయమేసింది విశాల్ అందుకే నేను చెక్ చేయలేదు ఆ నెంబర్ ఎవరిదో చూడు అని హాసిని అంటుంది.

ఇది ఎవరిదో తెలియదు కానీ ఈ నెంబర్ వైజాగ్ వాళ్ళ దాని మీద బుక్ చేసి ఉంది వదిన ఎవరో ఏమో మన ఇంట్లోనే ఫాలో చేస్తున్నారనుకుంటా అని విశాల్ అంటాడు.వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా మళ్లీ ఒక మెసేజ్ వస్తుంది ఏంటి అని చూసేసరికి వాళ్ళు అప్పుడు మాట్లాడుకుంటున్న వీడియో తీసి పెడతారు. వదిన ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఈ వీడియో తీసి పెట్టారు అంటే వల్లభ అన్న ఏమైనా ఇలా చేస్తున్నాడంటావా అని విశాల్ అంటాడు.

ఆయన మొహం విశాల్ ఆయన ఫోను ఆయన మోయడానికి కష్టపడతాడు ఇంకా ఫోన్లో వీడియోలు తీసి ఏం పెడతాడు అని హాసిని అంటుంది.అయితే తిలోత్తమ ఏమైనా ఇలా ప్లాన్ చేసిందా అని విశాల్ అంటాడు. ఆవిడ మొహం విశాల్ అత్తయ్య అని గౌరవం నలుగురిలోనే తప్ప ఆవిడకి అసలు ఏమీ తెలియదు అని హాసిని అంటుంది. అయితే ఎవరు చేసి ఉంటారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనే ఉండి వాళ్ళ మాటలు వింటున్న తిలోత్తమ రేయ్ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అది ఏమిటో మనం తెలుసుకోవాలి మన ఇంట్లో వాళ్ళు అయితే మనకు ఉపయోగపడతారు కదా అని తిలోత్తమ అంటుంది.అవును మమ్మీ ఇంట్లో వాళ్లే వాళ్ళని ఫాలో చేసి ఇలా చేస్తున్నారు అనుకుంటా చూద్దాం ఎవరో వాళ్ళు అని వల్లభ అంటాడు.

కట్ చేస్తే సుమనని టబ్బులో నీళ్లు పోసి మొహం అందులో పెట్టి ముంచుతూ ఉంటారు పావన మూర్తి దురంధర. ఇంతలో విక్రాంత్ వచ్చి అలా చేస్తే సచ్చి ఊరుకుంటుంది లేవండి అని వాళ్ళిద్దర్నీ పక్కకి నెట్టేస్తాడు విక్రాంత్. ఏంటి అల్లుడు ఇలా సుమననే చేయమన్నది లేదంటే మేమెందుకు అలా చేస్తాము అని పవన మూర్తి అంటాడు. బాబాయ్ నా మా నాన్న నేను నా పని చేసుకుంటుంటే మీరే వచ్చి ఇలా చేస్తున్నారు నన్ను అంటారు ఏంటి అని సుమన అంటుంది. రేపు తెల్లారితే పండగ నీ మొహం ఇలా ఉంటే నువ్వు షాపింగ్ చేసిందంతా దండగా కాబట్టి నువ్వు దమక్క దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగు నీ మొహం మామూలుగా మారిపోతుంది అని విక్రాంత్ అంటాడు. నేను చస్తే అడగను అని సుమన అంటుంది. ఇంతలో నైని వాళ్లు తిలోత్తమ అందరూ అక్కడికి వస్తారు. సుమన మొహం చూసి అందరూ షాక్ అవుతారు.

ఏంటి నీ మొహం ఇలా అయింది చెల్లి అని హాసిని అంటుంది. ఇలా ఉంటే బాగోదని మేకులతో చర్మాన్ని వలిచేశాను అని సుమన అంటుంది. అదేమన్న బత్తాయి పండ్లు అనుకున్నావా వలి చేయడానికి అని పావన మూర్తి అంటాడు. ఎవరైనా చెప్పారా నీ పాటికి నువ్వు చేసావా అని విశాల్ అంటాడు. ఎవరు చెప్పలేదు బావగారు నేనే రేపు పండుగ కదా నా మొహం ఇలా ఉంటే బాగోదని చేశాను అని సుమన అంటుంది. నీ మొహం ఎరుపు పోయి మెరిసిపోవాలి అంటే ఎద్దులయ్యని దమక్కని కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడు అని నైని అంటుంది. ఇంట్లో పని చేసే వాళ్ల కాళ్లు పట్టుకొని నేనెందుకు అడగాలి ఏదో కెమికల్ ప్రాబ్లం అయి ఉంటుంది దానికి వాళ్లను కాళ్లు పట్టుకొని అడిగితే నా మొహం ఎలా బాగవుతుంది అని సుమన అంటుంది.
ఎందుకు లేచి మన మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనే చూసి చెప్తాడు లేదంటే సర్జరీ చేస్తాడు అని తిలోత్తమ అంటుంది. నేను ఏ హాస్పిటల్ కి రాను అదే తగ్గిపోతుంది అని సుమన మొండిగా అంటుంది. మా కాళ్లు పట్టుకొని అడగడం నీకు నాముషి అనిపిస్తే అమ్మ వస్తుంది ఆవిడను అడుగమ్మా నీ మొహం బాగు అయిపోతుంది అని ఎద్దులయ్య అంటాడు. ఎవరు ఆ గారడి పిల్ల వస్తుందా అంటే మీరు అంత ఒకే గ్యాంగ్ డబ్బులు కోసం ఇలా చేస్తున్నారా ఫోను లేకపోయినా మీరు నెట్వర్క్ ఉపయోగిస్తున్నట్టున్నారు అని తిలోత్తమ అంటుంది.

చూడమ్మా మేము విశాలాక్షిని కనకపోయినా కూతుర్లా చూస్తున్నాం తనను అలాంటి మాటలతో బాధపెట్టకండి అని విశాల్ అంటాడు. ఏమో నిజంగానే డబ్బు కోసం వీళ్లంతా ఇలా ఒక ముటా అయ్యి చేస్తున్నారేమో అని సుమన అంటుంది. నీకు 10 కోట్లు ఇచ్చాడని విశాల్ అందరికీ అలానే దానం చేస్తాడు అనుకుంటున్నావా ఏంటి పిచ్చి మొహం, ఎప్పుడూ విశాలాక్షి వచ్చిన తనకు చీర తప్ప ఇంకేమీ ఇవ్వలేదు అని దురందర అంటుంది. ఎందుకని దత్తయ్య బ్రో అడగకముందే డబ్బులు ఇచ్చాడు కదా అలాగే మాట్లాడుతుంది అని విక్రాంత్ అంటాడు. నేను అందుకే బాబు గారిని డబ్బు ఇవ్వొద్దు అన్నాను కానీ ఆయనే ఇచ్చారు అని నైని అంటుంది.కట్ చేస్తే ఇంతలో తెల్లవారుతుంది నైని హాసిని ఇద్దరు కలిసి వాకిట్లో ముగ్గు వేస్తూ ఉంటారు.

చెల్లి పండగ వస్తే చాలు ఆడవాళ్లు ఇంట్లో పని చేయలేక చచ్చిపోవాలి మగవాళ్ళు మాత్రం ఏమీ చేయకుండా అలా కూర్చుంటారు ఒక మావిడాకులు అన్న కట్టొచ్చు కదా అని హాసిని అంటుంది. మమ్మీ మా ఆవిడ ఏంటో ఆకులు అంటుంది ఏంటి అని వల్లభ అంటాడు. ఆ విడాకులు కావాలంటున్నాను ఇస్తారా అని హాసిని అంటుంది.ఏ సుమ్మి పొద్దున్నే పండగ పూట విడాకుల గురించి మాట్లాడుతావేంటే అని దురందర అంటుంది. అయితే రేపు పొద్దున పంచాయతీ పెట్టించి ఎవరు ఆకులు వాళ్ళకి ఇప్పించండి పిన్ని అని హాసిని అంటుంది.. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.