Trinayani October 9 ఎపిసోడ్ 1053: నువ్వు నాకు అమ్మతో సమానమే సుమనా అని విశాల్ అంటాడు. చీర కట్టుకున్న అత్త తనకు అర్థం కాలేదు లే బాబు గారు అని నైని అంటుంది. ఆ మాటలు నిన్నే అంటున్నారు సుమన అని వల్లభ అంటాడు. ఏవండీ పెట్టారా ఫిట్టింగు అని హాసిని అంటుంది. పెట్టింది మేం కాదే సుమనను అంటున్నది మీరే గొడవ పడుతున్నది మీరే అని తిలోత్తమ అంటుంది. మా అమ్మ బాగోలేదు కాబట్టి నువ్వు అలా రెచ్చిపోతున్నావే అని వల్లభ అంటాడు. మీ అమ్మకి ఏం బాగోలేదండి చూపించమనండి అని హాసిని అంటుంది.

ఒసేయ్ పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావ్ నీకేనా అర్థం అవుతుందా అని దురంధర అంటుంది. సుమన పాలు కలుపుతున్నానని చెప్పొచ్చు కదా అని డమ్మక అంటుంది. కల్తీ పాలు ఎందుకు చక్కగా అమ్మపాలు కల్తీ కాకుండా ఉంటాయి అవే ఉలోచికి పట్టొచ్చు కదా ఆరోగ్యంగా ఉంటుంది అని విశాలాక్షి అంటుంది. అవును సుమన చిన్న పిల్ల అయినా తను చక్కగా చెప్పింది నువ్వు ఎందుకు వినట్లేదు నీ పాలు ఇవ్వచ్చు కదా అని విశాల్ అంటాడు. మీకేంటి బావగారు మీరు ఎన్నైనా చెబుతారు మీరు ఎన్ని చెప్పినా సరే నీను ఊలోచ్చికి ఫోత పాలే పడతాను అని సుమన అంటుంది.

చెల్లి తను ఎందుకు చెప్తుందో ఒకసారి అర్థం చేసుకో అని నైని అంటుంది.మీ దగ్గర ఉంటే నా టైమంతా వేస్ట్ అవుతుంది పక్కకు జరగండి నేను వెళ్తాను అని సుమన అంటుంది. సుమన నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నీ పాలే ఇవ్వు అని విశాలాక్షి అంటుంది. అయిన ఊలోచిని కన్నది నేను నువ్వేమైనా బిడ్డల్ని కన్నావా నీకు తెలిసినట్టు చెప్తున్నావ్ అని సుమన అంటుంది. అవును చిన్న మరదలా అమ్మ అమ్మ అని పిలిచే డమక్కని ఎద్దులైయని కన్నదేమో అని వల్లభ నవ్వుతాడు. వల్లభా అన్న దాంట్లో తప్పేముంది తను ఏమైనా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నదా అలా కంటే ఈ పూట పాలు ఇవ్వమని చెప్పు అని తిలోత్తమా అంటుంది. అలాగే పడతాను తీసుకురండి కడుపునిండా పాలు పడతాను అని విశాలాక్షి అంటుంది.

విశాలాక్షి నువ్వు అలా మాట్లాడితే వీలు ఇంకా నిన్ను చులకన చూస్తారు ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడతావు అని నైని అంటుంది. అవునమ్మా నువ్వు ఈ రూపంలో ఎందుకు వచ్చావు మాకు అర్థమైంది కానీ వీళ్లకు తెలియక నిన్ను ఎగతాళి చేస్తున్నారు నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే ఇంకా చిన్నతనం చేసి మాట్లాడుతారు విశాలాక్షి నువ్వు అలా అనకమ్మ అని విశాల్ అంటాడు. వల్లభ పిల్లలు లేని మాకే చాలా బాధగా అనిపిస్తుంది పెళ్లి కానీ పిల్ల తను తనకి ఎంత బాధేస్తుంది అలా మాట్లాడకు అని దురంధర అంటుంది.మా అమ్మే పాలిస్తానంటే మీకెందుకు అమ్మ అంత బాధ అని డమ్మక అంటుంది.

అందరూ గొడవ పడడం ఎందుకు ఆవిడ్డూరం ఏంటో చూద్దాము అని దురంధర అంటుంది. పిచ్చి దురంధర పిల్లకు పాలు ఇవ్వాలంటే తల్లి కావాల్సిందే లేదంటే గారడిచేసో మాయ చేస్తేను పాలు రావు ప్రసవించి ఒక బిడ్డకు తల్లి అయితేనే పాలు వస్తాయి అని తిలోత్తమ అంటుంది. పాలిస్తే తన అందం చెడిపోతుందని ఇవ్వట్లేదు అని విక్రాంత్ అంటాడు. అందమ ఎక్కడుంది అని విశాలాక్షి అంటుంది. అంటే సుమన అందంగా లేదని అంటున్నావా అని తిలోత్తమా అంటుంది. నేను అలా అనలేదు అందం అంటే పైకి కనిపించేది కాదు కళ్ళు మూసుకొని చూస్తే కనిపించే సౌందర్యం మూడు లోకాలలో భగవంతుడికి తప్ప ఇంకెవరిది లేదు అని విశాలాక్షి అంటుంది.

నన్ను వికారంగా ఉన్నానని అంటావా అయితే ఈ పాలు నీ మొహం మీద కొడతాను అని సుమనా పాలు తీసి విశాలాక్షి మొహం మీద పోస్తుంది. నైనికి కోపం వచ్చి సుమన చంప మీద ఒకటి ఇస్తుంది . అక్క నన్నెందుకు కొడుతున్నావు తప్పు చేసింది విశాలాక్షి అయితే అని సుమన అంటుంది. తను ఏదో తెలియక మాట అంటే నువ్వు విశాలాక్షి మొహం మీద పాలు పోస్తావా నిన్ను చంపేస్తాను అని నైని అంటుంది. అమ్మ సుమన తప్పు ఏమీ చేయలేదు కోపంతో నా మీద పాలు పోసిన నాకు అభిషేకం చేసిందని అనుకుంటాను అని విశాలాక్షి అంటుంది.నీకైతే బాధ కలిగింది కదా అమ్మ అని డమ్మక అంటుంది. దానికైతే ఫలితం నవరాత్రుల సమయంలో ఈ ఇంట్లో పసిబిడ్డలకి పాలు ఒకరోజు దొరకవు అని విశాలాక్షి అంటుంది.అమ్మ చెప్పింది అంటే జరిగి తీరుతుంది కానీ తనే ఏదో ఒకటి చేయాల్సిందే అని డమ్మక అంటుంది.కట్ చేస్తే సుమన ఏ చీర కట్టుకోవాలా అని తీసి చూస్తుంది. ఏంటి చీరలని ముంగటేసుకొని చూస్తున్నావ్ అని విక్రాంత్ అంటాడు. ఏం చీర కట్టుకోవాలి అని చూస్తున్నాను అని సుమన అంటుంది. అయితే కట్టుకున్నావా మరి అని విక్రాంత్ అంటాడు. ఏది కట్టుకుంటే బాగుంటుంది అని అంటుంది.

చీర అసలు ఎవరు పట్టుకుంటారో తెలుసా సంసారం చేసే ఆడవాళ్లు కట్టుకుంటే అందం నీలాంటి వాళ్లు కట్టుకుంటే ఆ చీర ఎంత మంచిదేనా బెదురు పెట్టినట్టే ఉంటుంది అని విక్రాంత్ అంటాడు. అంటే నాకు చీర కట్టుకోవడమే రాదు అసలు నాకు బాగోదు అని అంటున్నారా నీతో మాట్లాడుతూ ఉంటే పొద్దుపోతుంది తప్పకోడి ఉలొచికి పాలు పట్టాలి అని సుమన అంటుంది. ఇంకా డబ్బా పాలే పడుతున్నావా అని విక్రాంత్ అంటాడు. మీరు వెళ్తారా నన్నే బయటకు వెళ్ళమంటారా అని సుమన అంటుంది. కట్ చేస్తే ఏంటి అందర్నీ అత్తయ్య హాల్లోకి రమ్మందంట అని సుమన అంటుంది. నిన్నెవరు రమ్మన్నారే అని విక్రాంత్ అంటాడు. ఇంతలో వల్లభ త్రిలోత్తమని ఎత్తుకు వచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. అమ్మ అన్నయ్యని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నన్ను పిలిస్తే ఎత్తుకొచ్చి కూర్చోబెట్టే వాడిని కదా అని విశాల్ అంటాడు. మంచం మీద తప్ప నేను ఇంకెక్కడ కూర్చోలేక పోతున్నాను విశాల్ అని తిలోత్తమా అంటుంది. కొడుకు అంటే విశాల్ కానీ మీరు కాదండి అని హాసిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.