Trinayani September 30 ఎపిసోడ్ 1046: విశాలాక్షి పాప ఎక్కడ ఉందో సమాధానం చెప్తావా లేదా అని సుమన అంటుంది. ఏంటి చెల్లి ఎంత చెప్పినా అలాగే మాట్లాడుతున్నావు అని నైని అంటుంది. ఏంటక్కా నువ్వు చెప్పేది నేను వినేది నా కూతుర్ని దూరం చేసిన ఈ విశాలాక్షి ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోతావా గెంటేమంటావా అని అంటుంది. ఎందుకమ్మా అలా రంకెలు వేస్తావువ్ విశాలాక్షి ఏం చేసిందని అని హాసిని అంటుంది. సుమన చెప్పింది కరెక్టే కదా మరి అలాంటప్పుడు పాప ఎక్కడుందో చెబితే తన ఇంట్లోనే ఉంటుంది కదా అని తిలోత్తము అంటుంది. తను ఎక్కడికి వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది అని నైని అంటుంది.

ఎందుకు శుభ్రంగా మెక్కి కూర్చోడానికా అని అంటుంది. తను పుట్టింది దొరకని ఇంటికి రాలేదమ్మా అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఏది ఏమైనా విశాలాక్షి ఇంట్లో ఉండకూడదు అని తన చేయి పట్టుకొని బయటికి తీసుకు వస్తుంది సుమన. చెల్లి తన చెయ్యి వదులు వెళ్లిపోతానని విశాలాక్షి అంటుంది కదా నువ్వెందుకు చెయ్ పట్టుకొని గెంటేస్తున్నావు అని నైని అంటుంది. ఎందుకు మళ్ళీ అమ్మానాన్న అంటూ మిమ్మల్ని బ్రతిమిలాడి ఇక్కడే ఉండి పోవటానికి సుమన అంటుంది. నిన్ను ఇబ్బంది ఏమి పెట్టనులే సుమన అని అమ్మానాన్నలకి ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను అమ్మ రెండు రోజుల దాకా నువ్వు గాని నాన్న గాని బయటికి వెళ్ళకండి ఎలాంటి పరిస్థితి ఎదురైన మీరు ఇంట్లోనే ఉండండి అని విశాలాక్షి వెళ్ళిపోతుంది.ఆ అమ్మలేదన్న అమ్మని చేయి పట్టుకొని బయటికి గెంటేశావు అంటే నువ్వు ఎంత దుర్మార్గురాలివి నీకు పుట్టగతులు ఉండవు అని పెద్ద బొట్టమ్మ అంటుంది.

ఎందుకు విశాలాక్షిని బయటికి వెళ్ళగొట్టిందాక ఊరుకోలేదు అని నైని అంటుంది. ఈ ఒక్క రోజుకి సుమనకి నైనికి నేను కనిపించని విషయాలు చెప్పింది కదా అందుకే నేను అంటున్న మాటలు వీళ్ళకి ఎవరికి వినపడట్లేదు అయ్యో భగవంతుడా ఇప్పుడు ఏం చేయను అని పెద్ద బొట్టమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే బాబు గారు మీ ఆఫీస్ ఫైల్ అన్ని కట్టేసి ఒక చోట దాచి పెట్టాను వాటిని వెతకండి అని నైని అంటుంది.వాటిని దాచినట్టే ఉలోచిని కూడా ఎక్కడ దాచావు నైని చెప్పు అని విశాల్ అంటాడు. అన్నయ్య ఎవర్ని అనుమానించిన నేను సహిస్తాను కానీ వదినను అనుమానిస్తే నేను ఊరుకోను అని విక్రాంత్ అంటాడు.అది కాదు విక్రాంత్ విశాలాక్షి చెప్పిందని మీ వదిన ఇలా చేస్తుంది పాపని కూడా అలాగే దాచి ఉంటుందేమో అని అడిగాను అని విషయాలు అంటాడు.

పెద్ద బుట్టమ్మ ఆడించి ఉయ్యాలో పడుకోబెట్టిన తరువాత ఉలొచి పాముగా మారి పెద్ద బుట్టమ్మ వెనకాల వెళ్లిపోయిందేమో తనకు కూడా తెలియదు కదా మళ్లీ తిరిగి వద్దాము అనుకుంటే దారి దొరకక పోయి ఉండొచ్చు ఇంత పెద్ద హైదరాబాదులో ఏ లారీ కింద పడి చనిపోయి ఉండొచ్చు అని విక్రాంత్ అంటాడు. విక్రాంత్ చిన్నపిల్లలు ఆయుషు మంత్రాలు అవ్వాలని కోరుకోవాలి కానీ చనిపోయిందేమో అని అనకూడదు అని నైని అంటుంది. కట్ చేస్తే అమ్మ ఏమి నటించావమ్మా ఎవరికి అనుమానం రాకుండా భలే మ్యానేజ్ చేశావు అని వల్లభ అంటాడు. మరి ఉలోచిని దాచినట్టు వాళ్ళకి తెలియకుండ ఉండాలంటే అలా మాట్లాడాలి అని తిలోత్తము అంటుంది. అమ్మ ఇంకా ఎలాగో విశాలాక్షి వెళ్ళిపోయింది కదా ఉలోచినిని ఇచ్చేద్దామా అని వల్లభా అంటాడు.
ఒరేయ్ స్వామిజి విశాల్ నైనీ కి కాల దోషం ఉందని చెప్పాడు అదే మాట విశాలాక్షి కూడా వాళ్ళని రెండు రోజులు బయటికి వెళ్ళొద్దని చెప్పింది పాపని దొరకకుండా అలాగే ఉంచితే వాళ్ళు బయటికి వెళ్తారు వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఏదైనా జరుగుతుంది అని తిలోత్తము అంటుంది. అర్థమైంది అమ్మ నీ ప్లాను అని వల్లభ అంటాడు. కట్ చేస్తే సుమన ఇంట్లోనే ఉండి రమ్మని ఫోన్ చేసావ్ ఏంటి అని విశాల్ అంటాడు. బయటే నిలబడి పోయారే లోపలికి రండి బావగారు అని సుమన అంటుంది. మా తమ్ముడు లేనప్పుడు నేను లోపలికి రాను సుమన పర్వాలేదు చెప్పు ఇక్కడే ఉంటాను అని విశాల్ అంటాడు. ఇంతలో విక్రాంత్ అక్కడికి వస్తాడు ఏంటి బ్రో నాకు చెప్పకుండా ఏమైనా సీక్రెట్ మాట్లాడుకోవాలా అయితే నేను వెళ్తాను అని విక్రాంత్ అంటాడు. రేయ్ విక్రాంత్ నువ్వు ఇక్కడే ఉండు సుమన నువ్వు చెప్పమ్మా అని విశాల్ అంటాడు. మీ తమ్ముడే అంత పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు లోపలికి రావడానికి భయ పడతారేంటి బావగారు అని సుమన అంటుంది. అది భయం కాదే గొర్రె అభిమానం అన్నయ్య ఆడవాళ్లకు ఇచ్చే రెస్పెక్ట్ అని విక్రాంత్ అంటాడు.

గదిలో ఒక్కరే ఉన్నప్పుడు అమ్మ అయినా నేను లోపలికి వెళ్ళను అని విశాల్ అంటాడు. బావగారు మా అక్క పాపని ఎక్కడ దాచి పెట్టిందో చెప్పమనండి అని అంటుంది. ఒసేయ్ నిన్ను అని సుమన మెడ పట్టుకోబోతాడు. విక్రాంత్ సుమన మీద చేయి పడితే బాగోదు అని విశాల్ అంటాడు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే దీని ఆయుష్ పెరిగిపోతుంది అన్నయ్య అని విక్రాంత్ అంటాడు. నా ఆయుషు కాదు నా పాప ఆయుష్ ఉందో లేదో కనుక్కోండి అని సుమన అంటుంది. సుమన దయచేసి అలా మాట్లాడకు పాప ఎక్కడ ఉందో వెతికి తెచ్చి నీకు ఇస్తాను అని విశాల్ అంటాడు. కట్ చేస్తే విశాల్ నైని కలిసి వాళ్లకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి మా పాప జాడ ఏమైనా తెలిసిందా అని అడుగుతారు.

ఏమైంది బ్రో ఏమైనా జాడ తెలిసిందా అని విక్రాంత్ అంటాడు. కేసు పెట్టకుండా పాపని వెతకమంటే స్లోగా అవుతుంది అని అంటున్నారు అని విశాల్ అంటాడు. కేసుల దాకా వెళితే కిడ్నాపర్సు పాపని ఏదైనా చేయొచ్చు అని తిలోత్తమా అంటుంది. మాత పాప బయట ఉందో లోపల ఉందో చెప్పమందువ ఏమంటావు అని ఎద్దులయ్య త్రిలోత్తమని అడుగుతాడు. నువ్వు మాట్లాడే మాటలు అపార్థాలు తీసి మా సంబంధాలు తెగిపోయేలా ఉంటాయి నువ్వు ఏమి మాట్లాడకు అని తిలోత్తమ అంటుంది. అలాగే మాత ఈశ్వరుడు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చుగాక అని ఎద్దులయ్య అనుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది