SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కీ మొదటినుండి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరి నెలలో పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోగా అక్టోబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దామని అనుకున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మహేష్ చాలా డిప్రెషన్ కి గురయ్యారు. అదే సమయంలో సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే కాలికి కూడా ఫ్రాక్చర్ కావడంతో… సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కొన్ని నెలలపాటు ఆగిపోయింది.

కన్నీటియోలా సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు 60 రోజులపాటు ప్రస్తుతం షెడ్యూల్ ఏకధాటిగా జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మహేష్ సినిమా షూటింగ్ సెట్ కీ సంబంధించిన రకరకాల ఫోటోలు ఇటీవల బయటకు వస్తున్నాయి. లేటెస్ట్ గా డైరెక్టర్ త్రివిక్రమ్… సినిమా యూనిట్ సభ్యులతో క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఈ వీడియోలో త్రివిక్రమ్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. పాడుపడ్డ బిల్డింగ్ లొకేషన్, మిగతా యూనిట్ సభ్యులు లుంగీలతో కనిపిస్తూ ఉండటంతో… యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో మహేష్ నటించిన అతడు మరియు ఖలేజా రెండూ కూడా ఒకదానికి మరొక దానికి పొంతన ఉండదు. రెండు సినిమాలలో మహేష్ బాబుని రెండు విధాలుగా చూపించాడు. దీంతో మూడో సినిమాలో ఏ రకంగా మహేష్ నీ త్రివిక్రమ్ చూపిస్తాడు అన్నది అభిమానులలో ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 28వ తారీకు విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని నెలల పాటు షూటింగ్ లు వాయిదా పడుతూ రావడంతో ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Director Of #SSMB28 😍@urstrulymahesh #maheshbabu pic.twitter.com/nJx51M7Cnt
— SSMB (@SSMBHERE) February 1, 2023