టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోంది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్‌తో ఆగస్టు నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఈలోపే త్రివిక్రమ్ మహేశ్‌ను వదిలేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను తగులుకున్నాడు. అయితే సినిమా కోసం కాదులేండి.. ఓ యాడ్ షూట్ కోసం బన్నీ, త్రివిక్రమ్ కలిసి వర్క్ చేయబోతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `పుష్ప`తో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు బన్నీ. ఈ ఇమేజ్ నేపథ్యంలోనే ఆయన బ్రాండ్ వాల్యూ అంతకంతకూ పెరిగిపోతోంది. అనేక వ్యాపార సంస్థలు బన్నీని తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకునేందుకు పోటీ పడుతున్నాయి. తాజాగా కూడా ఓ ప్రముఖ సంస్థ తమ ప్రొడెక్ట్‌ను ప్రమోట్ చేసేందుకు బన్నీని లాక్ చేసుకుంది.
ఈ క్రమంలో సదరు బ్రాండ్ ఎండార్స్మెంట్ షూట్ లో బన్నీ నేడు పాల్గొంటున్నారు. హైదరాబాద్ ఈ యాడ్ షూట్ ప్రారంభమైంది. ఈ యాడ్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Stlysih star @alluarjun in an ad shoot which is happening in Hyderabad and #TrivikramSrinivas is directing this.#AlluArjun #PushpaTheRule #Trivikram #Pushpa pic.twitter.com/MmkZtX47u1
— Thyview (@Thyview) July 26, 2022