Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యి అప్పుడే మొదటి వారం కంప్లీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. స్టార్టింగ్ మొత్తం 14 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ లో 8 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొదటి వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు పల్లవి ప్రశాంత్, రతిక రోస్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, షకీలా, డామిని, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్. ఎనిమిది మందిలో మొదటి వారం ఎవరు హౌస్ నుండి వెళ్తారు అన్నది టెన్షన్ పడుతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరిని హౌస్ నుండి పంపించటం లేదని టాక్.
గత సీజన్ సిక్స్ లో కూడా ఈ రకంగానే.. మొదటివారం ఎలిమినేట్ కావలసిన కంటెస్టెంట్ నీ కాపాడడం జరిగింది. ఎందుకంటే మొదటి వారమే పరిచయాలు పెద్దగా ఉండకపోవటంతో పాటు వాతావరణ అలవాటు చేసుకునే అవకాశం లేకపోవడంతో.. ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. ఇప్పుడు సీజన్ సెవెన్ లో కూడా.. నామినేట్ అయిన 8 మందిలో ఎవరిని ఎలిమినేట్ చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. మరోపక్క వీకెండ్ ఎపిసోడ్లో మరికొంతమంది కంటెస్టెంట్స్ ఇద్దరు లేదా ముగ్గురు.. హౌస్ లోకి కొత్తగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా వీకెండ్ ఎపిసోడ్ ఇంటి సభ్యులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చే రీతిలో ప్లాన్ చేసినట్లు సమాచారం.
మరి ఇలాంటప్పుడు ఎందుకు ఓటింగ్ వేయించుకున్నారని తాజా వార్తలు పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఎలిమినేట్ చేసే ఉద్దేశం లేనప్పుడు నామినేషన్ ప్రాసెస్ నిర్వహించడం ఎందుకు..?, జనాలను పిచ్చోళ్ళు చేసి ఓట్లు వేయించుకోవడం ఎందుకు..? అంటూ ప్రశ్నిస్తున్నే విమర్శలు చేస్తున్నారు. అయితే మొదటి వారం ఇలా ఉన్న రెండో వారం మాత్రం డబల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు.. ఈ రకంగా ఇంటి సభ్యులను టెన్షన్ పెట్టించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.