32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News TV Shows and Web Series

Jhansi Webseries Review: డిస్నీ హాట్ స్టార్ లో అదరగొడుతున్న అంజలి “ఝాన్సీ” వెబ్ సిరీస్..!!

Share

Jhansi Webseries Review: డిస్నీ హాట్ స్టార్ లో “ఝాన్సీ” వెబ్ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంటూ నిన్నటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి సీజన్ 6 ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్ కి తిరు దర్శకత్వం వహించారు. కృష్ణ కులశేఖరన్, మధుబాల నిర్మాతగా రాణించారు.

నటీనటులు:

అంజలి, చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అర్జున్, అభిరామ్ వర్మ, రమేష్ వారి తాలూరి తదితరులు.

సంగీతం:

శ్రీ చరణ్ పాకల .

 

Anjali is appearing in Disney Hot Star web series Jhansi
Jhansi Telugu Webseries
పరిచయం:

కరోనా వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు సినిమాల కంటే ఓటీటీ కంటెంట్ లకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఓటీటీ లలో వెబ్ సిరీస్ లు, షోలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. చిన్న నటుల నుండి స్టార్ నటీనటుల వరకు ఓటీటీ లలో రాణించటానికి ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే హీరోయిన్ అంజలి అందరికీ సుపరిచితురాలే. గోదావరి జిల్లాలకు చెందిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన క్రేజ్ సంపాదించింది. తెలుగులో టాప్ హీరోయిన్ అంత కాకపోయినా కానీ ఆ రీతిలోనే అవకాశాలు అందుకుంది. ఒక తెలుగులో మాత్రమే కాదు దక్షిణాది రంగంలో తమిళం , మలయాళం భాషల్లో కూడా అంజలికి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది.

Anjali is appearing in Disney Hot Star web series Jhansi
Jhansi Telugu Webseries

ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో “ఝాన్సీ” అనే వెబ్ సిరీస్ అక్టోబర్ 27వ తారీకు గురువారం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మొదటి సీజన్ లో 6 ఎపిసోడ్స్ వదిలారు. కృష్ణ కుల శేఖరన్.. మధుబాల నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి తిరు దర్శకత్వం వహించారు. గణేష్ కార్తీక్ రచయితీగా రాణించారు. గతం మర్చిపోయిన అమ్మాయిగా అంజలి.. తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తన గతాన్ని తెలుసుకోవడం కోసం ఝాన్సీగా అంజలి కనిపిస్తుంది. ఈ క్రమంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆ దృశ్యాలలో ఉన్న వ్యక్తులను గుర్తు తెచ్చుకోవటం కోసం రేఖమాత్రంగా గీసుకుంటుంది. మరి అదృశ్యాలలో కనిపించిన వాళ్ళు ఎవరు..? వాళ్లతో ఝాన్సీ కి సంబంధమేంటి..? అలాగే ఎటువంటి ట్రైనింగ్ లేకుండా కొన్ని విద్యలలో నైపుణ్యం ఝాన్సీ కి ఎలా వచ్చింది..? వీటన్నిటి విషయాలను తెలుసుకోవటానికి జర్నీ స్టార్ట్ చేయడమే “ఝాన్సీ” మూల కథ.

Anjali is appearing in Disney Hot Star web series Jhansi
Jhansi Telugu Webseries

 

కథ:

జలపాతంలో పడిపోయి ప్రవాహంలో కొట్టుకొచ్చిన యువతి (అంజలి) కేరళలో గిరిజనులు కాపాడుతారు. ఆమెకు గాయాలు కట్టి కోలుకునేలా చేస్తారు. ఈ క్రమంలో సంకిత్ (ఆదర్శ్ బాలకృష్ణ) తన ఒక్కగానొక్క కూతురైన “మేహ” తో కలిసి ఆ గిరిజనుల ఉండే అడవిలోకి వెళ్తారు. ఈ క్రమంలో సంకిత్ కూతురు మేహా ప్రమాదానికి గురవుద్ది. వెంటనే అంజలి కాపాడతది. దీంతో సంకిత్.. అంజలి గురించి తెలుసుకోవడానికి గిరిజనుల వద్దకు వెళ్తారు. అయితే ఆ గిరిజనులు ఆమెకు గతం గుర్తు లేదని చెబుతారు. దీంతో ఎంతో సాహసోపేతంగా తన కూతురిని కాపాడిన అంజలీని తనతో పాటు హైదరాబాదుకి తీసుకొస్తాడు. ఈ క్రమంలో తన అంకుల్ సాయంతో ఆమెకు గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాడు.  అంజలికి సంకిత్ కూతురు మేహ పెట్టిన పేరే “ఝాన్సీ”. అయితే సంకిత్ తన భార్య పోలీస్ ఆఫీసర్ సాక్షికి చాలా దూరంగా ఉంటాడు. ఆమె ప్రవర్తన నచ్చక పోవడంతో ఒంటరిగా కూతురితో కలిసి బతుకుతాడు. ఈ క్రమంలో ఝాన్సీ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అతనితోనే కలిసి ఉంటున్న ఝాన్సీ తన పేరుతో ఒక వ్యాపారం కూడా స్టార్ట్ చేస్తది. వ్యాపారంలో భాగంగా ఒక ఇంటికి వెళితే.. అక్కడ ఓ పెద్దమనిషి ఆ ఇంటిలో ఆడపిల్లపై అఘయిత్యానికి పాల్పడితే ఝాన్సీ అడ్డుకునే క్రమంలో అతడు చచ్చిపోతాడు. దీంతో ఆ హత్య తాలూకు భయం ఝాన్సీని వెంటాడుతూ ఉంటది. ఈ రీతిగా ఝాన్సీ బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్న సమయంలో కారులో వెళ్తూ ఉన్న టైంలో ఒక రాజకీయ నాయకుడిని చూస్తది. ఆ వ్యక్తి యొక్క ముఖ రూపం తన కళ్ళ ముందు కనబడే దృశ్యాలలో ఒకడిగా గుర్తిస్తది. దీంతో సదరు రాజకీయ నాయకుడి గురుంచి అని విషయాలు ఎంక్వయిరీ చేస్తది. ఆ తర్వాత ఏదో రీతిలో తన బొటిక్ వ్యాపారం చేసే ప్రదేశంలో ఆ రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి బంధిస్తది. ఆ సమయంలో సదరు రాజకీయ నాయకుడి కంటి దగ్గర గాయం ఎలా అయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాది. ఇక అక్కడి నుండి తన గతాన్ని అతని ద్వారా… ఝాన్సీ తెలుసుకునే ప్రయాణం స్టార్ట్ అవుద్ది.

Anjali is appearing in Disney Hot Star web series Jhansi
Jhansi Telugu Webseries

 

విశ్లేషణ:

ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ వెబ్ సిరీస్ చిత్రీకరించడం జరిగింది. ప్రతి ఎపిసోడ్ లో అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందని ఉత్కంఠతో వీక్షకులను ఉంచే రీతిలో రూపొందించారు. ఝాన్సీ ప్రయాణంలో కొత్త కొత్త పాత్రలు ఎంటర్ అవుతూ ఉంrడటంతో స్టోరీపై మరింత ఆసక్తి కలిగేలా కథకి స్క్రీన్ ప్లే ప్రధానమైన బలంగా తీర్చిదిద్దారు. ఝాన్సీ గా అంజలి తన గతాన్ని తెలుసుకున్నాక అటు గతానికి ఇటు వర్తమానానికి మధ్య నలిగిపోయే పాత్రలో… ఆమె నటన చాలా హైలెట్. యాక్షన్ సీన్స్ లో కూడా శభాష్ అనిపించింది. కచ్చితంగా “ఝాన్సీ”. అంజలి కెరియర్ లో చెప్పుకోదగ్గ వెబ్ సిరీస్ గా నిలుస్తుందని నిర్మోహమాటంగా చెప్పవచ్చు.


Share

Related posts

డబ్బింగ్ స్టార్ట్ చేసిన అనసూయ..!!

sekhar

నిఖిల్ న‌యా రికార్డ్‌.. ప్ర‌భాస్‌, రజినీకాంత్‌ల‌ను కూడా మించిపోయాడు!

kavya N

Pushpa 2: లీక్ అయిన “పుష్ప 2” డైలాగ్..సోషల్ మీడియా షేక్..!!

sekhar