బిగ్ బాస్ సీజన్ సిక్స్ షో మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు ఇప్పటికే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన 19 మంది సభ్యులను సెలెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా మొదట 15 మంది గతంలో మాదిరిగానే మొదటి రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటట్టు షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్లు టాక్. మిగతా నలుగురు సభ్యులను వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో పంపించాలని.. అనుకుంటున్నారట. సీజన్ ఫైవ్ లో ఎక్కడా కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలు లేవు.
అయితే ఈసారి సీజన్ సిక్స్ లో దాదాపు నలుగురు టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో..హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఐదు సీజన్ లలో ఫిజికల్ టాస్కులు.. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఈ ఆరో సీజన్ లో చాలా వైవిధ్యాంగ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్ లో చాలా వరకు సీరియల్ నటీనటులతో పాటు యూట్యూబ్ స్టార్స్ … సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నవాళ్లు మాత్రమే కనిపించారు.
కానీ ఈ ఆరో సీజన్ లో మాత్రం దాదాపు అందరూ తెలిసిన మోకాలే ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో పాటు.. టీవీ న్యూస్ యాంకర్స్ మరియు సింగర్స్..నీ కంటెస్టెంట్ లుగా షో నిర్వాహకులు తీసుకున్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే మొదటిగా హౌస్ లోకి ఎంటర్ కానున్న 15 మంది బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇంటి సభ్యులను క్వారన్ టైన్ లోకి రెండు రోజులపాటు ఉంచనున్నారట. ఆగస్టు 29 మరియు 30 తేదీలలో క్వారన్ టైన్ లోకి వెళ్ళనున్నారట. దీన్ని బట్టి చూస్తే వచ్చే సోమవారం నుండి బిగ్ బాస్ షో ప్రసారానికి నాంది పలుకుతున్నట్లు తెలుస్తోంది. మరి 15 మంది సభ్యులు ఎవరై ఉంటారో చూడలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!