డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “లైగర్” ఈనెల 25వ తారీకు విడుదలయ్యి నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. కనీసం మంచి నాలుగు ఏమాత్రం అందుకోకుండా డైరెక్టర్ పూరి మార్క్ పనితనం సినిమాలో ఉందని చూసిన జనాలు చెప్పుకొచ్చారు. హీరోగా విజయ్ దేవరకొండ చాలా కష్టపడినా గాని పూరి జగన్నాథ్ పడిన కష్టం సినిమాలో ఎక్కడా కనబడలేదని దర్శకుడిగా ఆయన ఫెయిల్ అయ్యారని అంటున్నారు. సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాలలో నటించే హీరోలకు స్ట్రాంగ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. “లైగర్” లో అదే మిస్సయిందని చెప్పుకొస్తున్నారు.
సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు 50 రోజులకు పైగానే బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చేయడం జరిగింది. హీరో విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ అనన్య పాండే ఇండియాలో అన్ని ప్రధాన నగరాలలో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేశారు. అయినా రిజల్ట్ తేడా పడటంతో సినిమా యూనిట్ ఫుల్ నిరాశలో ఉంది. ముఖ్యంగా వరుస ప్లాపులలో ఉన్న విజయ్ దేవరకొండ కి ఇంత దారుణంగా ఫలితం రావడం పట్ల అభిమానులు కూడా చాలా నిరుత్సాహం చెందుతున్నారు.
ఇంత దారుణంగా నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న “లైగర్”.. గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమా కలెక్షన్స్ తాజాగా దాటేసినట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. విషయంలోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో “లైగర్” పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. అంత మాత్రమే కాదు కలెక్షన్స్ అంతకంతకు పెంచుకుంటూ పోతూ ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి రోజు పుష్ప మూడు కోట్లు కలెక్ట్ చేయగా…”లైగర్” 4.7 కోట్ల కలెక్ట్ చేసి పుష్ప సినిమా మొదటి రోజు కలెక్షన్స్ దాటేయటం జరిగింది. దక్షిణాది ప్రేక్షకులకు అంతగా ఎక్కకపోయినా గానీ ఉత్తరాది ప్రేక్షకులు..”లైగర్” నీ బాగా ఇష్టపడుతూ ఉండటంతో సినిమా యూనిట్ కి కొద్దిగా ఉరట కలిగించినట్లయింది.