Samantha KTR: మోడీ పై కేటీఆర్ విమర్శలకు సమంత నుండి ఊహించని రియాక్షన్..!!

Share

Samantha KTR: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రజలలో ఉండే రీతిలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయటం మరో పక్క కాంగ్రెస్ కూడా.. వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయట పెడుతూ రాణించటం జరుగుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు దీటుగానే కౌంటర్ లు ఇస్తున్నారు.

ముఖ్యంగా జరగబోయే ఎన్నికలలో పోటీ బీజేపీ నుండి అని అన్నట్టుగా టిఆర్ఎస్ పార్టీ వర్గాల వ్యవహార శైలి కనిపిస్తోంది. మిగతా పార్టీలను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని టార్గెట్ చేస్తూ గత కొంత కాలం నుండి విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరును గత కొద్ది నెలల నుండి ఎండగడుతున్న సంగతి తెలిసిందే. మీడియా పరంగా సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ తనదైన శైలిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని మోడీ ప్రభుత్వ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో కేటీఆర్ చేసిన నెగిటివ్ కామెంట్ కి హీరోయిన్ సమంత రియాక్షన్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి విషయంలోకి వెళ్తే దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ ప్రజలు… దేశ జీడీపీలో ఐదు శాతం వాటా సమకూరుస్తున్నారు. మన దేశానికి కావాల్సింది డబ్బులు ఇంజిన్ కాదు.. డబుల్ ఇంపాక్ట్ గవర్నమెంట్.. అని కేటీఆర్ ఇన్ స్టాల్ ఓ పోస్ట్ పెట్టడం జరిగింది. కేటీఆర్ పెట్టిన ఈ పోస్టుకి సమంత లైక్ కొట్టడం జరిగింది. సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే సమంత.. పొలిటికల్ పోస్ట్ కి లైక్ కొట్టడం చర్చనీయాంశంగా మారింది.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

41 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

1 hour ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

4 hours ago