NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

Asin’s husband Rahul Sharma: వివాహం అనంతరం సినీ పరిశ్రమకు దూరమైన హీరోయిన్ల జాబితాలో అసిన్ ఒకరు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జ‌న్మించిన అసిన్‌.. 15 ఏళ్ల వ‌య‌సులో ఓ మలయాళ చిత్రం ద్వారా త‌న న‌ట‌నా ప్ర‌స్థానాన్ని ప్రారంభించింది. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ప్ర‌ధానంగా సినిమాలు చేసింది. అనాతి కాలంలోనే నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటింది. ఉత్త‌మ న‌టిగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే అసిన్ పెళ్లి పీట‌లెక్కింది.

2016లో రాహుల్ శర్మను అసిన్‌ వివాహం చేసుకున్నారు. క్రిస్టియన్ మ‌రియు హిందూ సంప్రదాయాల ప్ర‌కారం వీరి వివాహం జ‌రిగింది. మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేశాక అసిన్ నటనకు స్వస్తి చెప్పింది. 2017లో మొద‌టి సంతానంలో ఒక కుమార్తెకు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం భ‌ర్త కూతురితో అసిన్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. అసిన్ భ‌ర్త రాహుల్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. ఇత‌ను భారతదేశంలో తక్కువ ధర ఫీచర్ ఫోన్‌లను తయారు చేస్తున్న అతిపెద్ద కంపెనీ మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ. టెక్ మిలియనీర్‌లలో రాహుల్ శ‌ర్మ ఒక‌రు.

ఇండియ‌న్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో కీ రోల్ పోషిస్తున్న రాహుల్ శ‌ర్మ.. 1975లో జ‌న్మించాడు. ఢిల్లీలో పెరిగాడు. మెకానికల్ ఇంజనీరింగ్ అనంత‌రం కెనడా వెళ్లి సస్కట్చేవాన్ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. 2000వ సంవత్స‌రంగా రాహుల్ శ‌ర్మ త‌న స్నేహితులైన రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్ మరియు సుమీత్ అరోరాతో కలిసి మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్‌ను స్థాపించాడు. ఇందుకోసం త‌న తండ్రి వ‌ద్ద నుంచి రాహుల్ శ‌ర్మ‌ రూ. 3 ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నాడు.

మొద‌ట్లో ఐటీ సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఉన్న మైక్రోమ్యాక్స్.. 2008లో మొబైల్ వ్యాపారంలోకి ప్రవేశించింది. 2010 నాటికి సరసమైన ఫోన్‌ల తయారీలో భారతదేశపు అగ్రగామిగా మారింది. ఇండియాలో సింగిల్ బేస్‌బ్యాండ్ తో డ్యూయల్-సిమ్ ఫోన్‌లను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీగా నిలిచింది. అలాగే 2018లో రాహుల్ శర్మ తన కొత్త వ్యాపారమైన రివోల్ట్ ఇంటెల్లికార్ప్‌ను ప్రారంభించి.. తొలి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్ లోకి ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 3 ల‌క్ష‌ల‌తో వ్యాపారం మొద‌లు పెట్టిన ఆయ‌న ప్ర‌స్తుతం వంద‌ల కోట్ల‌కు అధిప‌తిగా చ‌లామ‌ణి అవుతున్నారు. ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. రాహుల్ శ‌ర్మ నికర విలువ రూ.1300 కోట్లు.

2016లో రాహుల్ శర్మ నటి అసిన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వీరి ప్రేమ‌కు పునాది వేశారు. అక్షయ్ కుమార్, రాహుల్ శ‌ర్మ మంచి స్నేహితులు. అసిన్‌ను 2012లో అక్షయ్ కుమార్ తన సన్నిహితుడు అయిన రాహుల్ శర్మకు పరిచయం చేసాడు. అలా ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి దారితీసింది. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఎంగేజ్‌మెంట్ రోజు రాహుల్ శర్మ అసిన్‌కు రూ. 6 కోట్ల విలువైన రింగ్ ను గిఫ్ట్ చేశారు. ప్ర‌స్తుతం వీరు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N