Unstoppable 2: దేశంలోనే అన్ని టాకీ షోలలో “అన్ స్టాపబుల్” మొదటి సీజన్ అనేక రికార్డులు సృష్టించటం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్ గా ఈషో అత్యంత ఆదరణ దక్కించుకుంది. అక్టోబర్ 14వ తారీకు నుండి “అన్ స్టాపబుల్” సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. మొదటి సీజన్ కి చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు రావటం తెలిసిందే. దీంతో మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ మరింత గ్రాండ్ గా షో నిర్వాహకులు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా మొదటి ఎపిసోడ్ కి టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ హాజరయ్యారు.
ఒకరు బామ్మర్ది మరొకరు అల్లుడు కావటంతో బాలకృష్ణ ఇంకా తనదైన శైలిలో కుటుంబం గురించి ఇంకా రాజకీయం గురించి అదే విధంగా వ్యక్తిగత జీవితం గురించి అనేక ప్రశ్నలు వేసి మంచి ఎంటర్టైన్మెంట్ పండించారు. ఈ షోలో రొటీన్ కి భిన్నంగా చంద్రబాబు చాలా ఎనర్జిటిక్ గా… నవ్వుతూ కనిపించారు. అయితే షోలో భాగంగా మా యూత్ గురించి అసలు ఏమనుకుంటున్నారు అని బాలయ్య చంద్రబాబుని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు ఒకే ఒక డైలాగ్ తో బాలకృష్ణ గాలి తీసేశారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు మాట్లాడుతూ నువ్వు యూత్ ఏంటి. నువ్వు కూడా సీనియర్ సిటిజన్. తల మెరిసిపోయింది..అని అన్నారు.
మీరు నటించే విషయంలో మేకప్ వేసుకొని యూత్ లాగా కనబడతారు. కానీ నేను ఎక్కడ ఉన్నా అందరికంటే ఆలోచనపరంగా యువకుడిని అని తనదైన శైలిలో చంద్రబాబు సమాధానమిచ్చారు. దీంతో చంద్రబాబు సమాధానానికి బాలకృష్ణ రియాక్ట్ అవుతూ.. నా తల మెరిసింది నేను ఓల్డ్ అని అంటారా .. అంటూ సరదాగా ఫీల్ అయ్యి నేను గోల్డ్ అంటూ బాలకృష్ణ కవరింగ్ చేసుకున్నారు. ఏది ఏమైనా అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్..లో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు సంచలనం రేపుతున్నాయి.