NewsOrbit
Entertainment News సినిమా

అదిరిపోయిన `అన్‌స్టాపబుల్ 2` ట్రైల‌ర్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!

నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ గా చేసిన షో `అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా గత ఏడాది ప్రసారమైన ఈ షో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇండియాలోనే టాప్ టాక్ షోగా రికార్డును సైతం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 2 ను స్టార్ట్ చేసేందుకు ఆహా టీం సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే ఎపిసోడ్లకు సంబంధించి షూటింగ్ ను సైతం షురూ చేశారు. అయితే తాజాగా అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్ ను మేకర్స్ బయటకు వదిలారు. ఈ ట్రైల‌ర్‌లో బాలకృష్ణ ఒక ప్రమాదకర మిషన్ ని చేపడుతూ కనిపించారు. `అంధకార భయారణ్యంలో నిక్షిప్తమైన నిగూడ నిధి అన్‌ మ్యాచెబుల్‌, అక్కడ ఎదురయ్యే సవాళ్ళు అన్‌ ప్రెడిక్టెబుల్‌.. అయినా ఆగని మనం పోరాటం అన్‌స్టాపబుల్.

unstoppable 2 show trailer
unstoppable 2 show trailer

గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్‌. ప్రశ్నల్లో మరింత ఫైర్‌.. ఆటల్లో మరింత డేర్‌.. సరదాల్లో మరింత సెటైర్‌..మీకోసం మరింత రంజుగా అన్‌స్టాపబుల్‌-2` అంటూ బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌తో పిచ్చెక్కించేశారు. చివ‌ర్లో బాల‌య్య ప‌లికిన `దెబ్బకు థింకింగ్ మారిపోవాలా` డైలాగ్ మ‌రింత హైలెట్ అయింది.

మొత్తానికి అదిరిపోయిన‌ `అన్‌స్టాపబుల్ 2` ట్రైల‌ర్.. షోపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా, అక్టోబర్ 14 నుంచి `అన్‌స్టాప‌బుల్ 2` స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ఆహా టీమ్ విడుదల చేయ‌నుంది. మ‌రి సీజ‌న్ 2 ఏ రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనుందో చూడాలి.

author avatar
kavya N

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri