UnStoppable 2: నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ చేసిన షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ టాక్ షో.. విశేష ప్రజాదారణ పొందింది. అలాగే నెం.1 టాక్ షోగా ఎన్నో రికార్డులను నెలకొల్పింది. హోస్ట్ అంటే ఎంతో లౌక్యంగా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో మాట్లాడుతూ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయాలి.
ముక్కోపి అయిన బాలయ్యకు ఇదెలా సాధ్యం అంటూ ఈ షో ప్రారంభానికి ఎందరో వెక్కిరించారు. ట్రోల్స్ చేశారు. ఆ హేళనలకు బాలయ్య గట్టి సమాధానం ఇచ్చారు. తనదైన హోస్టింగ్‌తో షోను సూపర్ సక్సెస్ చేశారు. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం నందమూరి అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో బాలయ్య నయా అప్డేట్ ఇచ్చారు. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ టాప్ 6 ఎపిసోడ్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా బాలయ్యను అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి ప్రశ్నించగా.. అందుకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. `మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే..` అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు.
ఇందుకు సంబంధించిన వీడియోను `ఆహా` వారు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ.. `త్వరలోనే అన్‌స్టాబుల్ టాక్ షో మళ్లీ మీ ముందుకు రాబోతుంది. ఈసారి ఎవరెవరు గెస్ట్‌గా రావాలనుకుంటున్నారో కామెంట్స్ చేయండి` అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో మరి కొద్ది రోజుల్లో సీజన్ 2 రాబోతోందని స్పష్టంగా అర్థమవడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…