Upasana Konidela: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రామ్ చరణ్-ఉపాసనలు నిన్న తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. పెళ్లై పదేళ్లు పూర్తి అవ్వడంతో.. ఈ జంట కొద్ది రోజుల క్రితమే ఇటలీలో వాలిపోయారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. వెడ్డింగ్ డేను మరింత స్పెషల్‌గా మార్చుకున్నారు.
ఫ్యాషన్ నగరంగా పేరు గాంచిన మిలాన్ లో చరణ్ దంపతుల మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇక పెళ్లి రోజు సందర్భంగా భర్త చరణ్ తో దిగిన కొన్ని పిక్స్‌ను ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ ఫొటోలు మెగా అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటూ క్షణాల్లో వైరల్ అయ్యాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే పెళ్లిరోజు ఉపాసన ధరించిన డ్రెస్ ధర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉపాసన గ్రీన్ కలర్ డ్రెస్ లో మెరిసింది. చూడటానికి ఎంతో సింపుల్‌గా ఉన్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం. ఫుల్ హ్యాండ్స్ ఉన్న ఈ డ్రెస్ ఖరీదు రూ.2,23,049.
నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాసన డ్రెస్ కాస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ కొనసాగుతూనే, మరోవైపు ‘బీ పాజిటివ్’ అనే ఒక మ్యాగజైన్ ద్వారా ప్రజల్లో ఫిట్నెస్ మీద అవగాహన కల్పిస్తోంది. అలాగే మెగా కోడలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటోంది.