Vaarasudu First Look: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `దళపతి 66` టైటిల్‌తో సెట్స్ మీదకు తీసుకెళ్లిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
. హీరో శ్రీకాంత్, ప్రభు, శరత్‌కుమార్, సంగీత, సంయుక్త, యోగిబాబు వంటి స్టార్‌లు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే జూన్ 22న విజయ్ బర్త్‌డే కావడంతో ఒకరోజు ముందుగానే ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సందర్భంగా టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకి ‘వరిసు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. `వరిసు` అంటే తెలుగులో వారసుడు అని అర్ధం. `వారసుడు` టైటిల్‌తో తెలుగులో, `వరిసు టైటిల్`తో తమిళంలో ఈ సినిమా విడుదల కానుంది. `ది బాస్ రిటర్న్స్` అనేది క్యాప్షన్ టైటిల్ క్యాప్షన్. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. అందులో సూటు, బూటు వేసుకుని సూపర్ స్టైలిష్ గా విజయ్ దర్శనమిచ్చాడు.
అదిరిపోయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ మూవీకి గత కొన్ని రోజులుగా `వారసుడు` అనే టైటిల్ వినిపించింది. విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ బాగుందని కామెంట్ లు చేశారు. ఇప్పుడు ఇదే టైటిల్‌తో పోస్టర్ విడుదల అవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…