Balakrishna-Varalaxmi: బాల‌య్య‌తో వ‌న్స్ మోర్ అంటున్న వరలక్ష్మి..?!

Share

Balakrishna-Varalaxmi: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్ర‌త్యేకమైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌మిళ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. ఆ త‌ర్వాత స‌హాక పాత్ర‌ల‌ను, విల‌న్ పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతోంది. ఇటు `తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్` మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ.. మొద‌టి ప్ర‌యోగంలోనే త‌న‌దైన న‌ట‌న‌తో ఇక్క‌డ విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది.

ఆ త‌ర్వాత `క్రాక్‌`, `నాంది` చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు మ‌రింత చేరువైన వ‌ర‌ల‌క్ష్మీ.. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ న‌టిగా మారింది.ఇక‌పోతే ఇప్పుడీ ఈమె తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `ఎన్‌బీకే 107` ఒక‌టి. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్నా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ఇది.

ఇందులో శ్రుతి హాస‌న్ హరోయిన్‌గా న‌టిస్తుంటే.. వ‌ర‌ల‌క్ష్మి ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా వ‌ర‌ల‌క్ష్మి బాల‌య్య‌తో వ‌న్ మోర్ అంటోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బాల‌య్య స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

`ఎన్‌బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్‌తో త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతోంది. తండ్రీకూతుళ్ల మ‌ధ్య సాగే క‌థ ఇది. ఇందులో బాల‌య్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీ‌లీల న‌టించబోతోంది. అయితే ఇందులో లేడీ విల‌న్ పాత్ర ఒక‌టి ఉంటుందట‌. ఆ పాత్ర కోసం వ‌ర‌ల‌క్ష్మిని సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే ఓకే చెప్పింద‌ని తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒక‌వేళ ఈ వార్త నిజ‌మైతే థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌కు పూన‌కాలు ఖాయ‌మ‌ని అంటున్నారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

5 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

14 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago