Entertainment News సినిమా

రికార్డు ధ‌ర ప‌లికిన `వార‌సుడు` నాన్‌-థియేట్రిక‌ల్ రైట్స్‌.. ఎంతో తెలుసా?

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్‌లో `వార‌సుడు(తమిళంలో వరిసు)` అనే మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై బ‌డా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. శ్రీకాంత్‌, ప్ర‌భు, శ‌ర‌త్ కుమార్‌, సంగీత, సంయుక్త‌, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

varasudu movie
varasudu movie

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. `వార‌సుడు` నాన్‌-థియేట్రిక‌ల్ రైట్స్ రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాయ‌ట‌. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కులు దాదాపు రూ.60 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నార‌ట‌.

అలాగే ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను రూ. 50 కోట్ల‌కు స‌న్ టీవీ కొన్న‌ట్లు తెలిసింది. ఇక ఆడియో రైట్స్‌ను రూ. 10 కోట్ల‌కు టీ సిరీస్ సంస్థ ద‌క్కించుకున్నట్లు చెబుతున్నారు. నాన్‌-థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా మొత్తంగా మేక‌ర్స్‌కు రూ. 120 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జ‌రిగిందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా విడుద‌ల‌కు మూడు నెల‌ల ముందే ఈ రేంజ్‌లో బిజినెస్ అంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.

 


Share

Related posts

అనుమానాలు వ‌ద్దు

Siva Prasad

నేను క్షేమంగానే ఉన్నాను…

Siva Prasad

అన్న విషయంలో ‘సీరియస్’గా ఉన్న ఎన్టీఆర్!

Teja