Venkatesh: సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బడా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
అయితే ఒకప్పుడు ఫ్యామిలీ కథా చిత్రాలను మాత్రమే చేసిన వెంకీ.. ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. `సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి సూపర్ హిట్ తరువాత ఆయనకు మల్టీస్టారర్ చిత్రాలపై మరింత ఇంట్రస్ట్ పెరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలోనే వచ్చిన గోపాల గోపాల, ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు మంచి విజయం సాధించడంతో.. టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా మారారు వెంకీ. ఇక ప్రస్తుతం ఆయన రానా దగ్గుబాటితో కలిసి ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.
బాబాయ్, అబ్బాయ్ వెండితెరపై కలిసి నటించడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ సిరీస్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే మరోవైపు వెంకీ మాస్ మహారాజ్ రవితేజతో ఓ మల్టీస్టారర్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథా చర్చలు ముగిశాయని అంటున్నారు. మొత్తానికి వెంకీ తీరు చూస్తుంటే.. ఇప్పట్లో ఆయనకు మల్టీస్టారర్స్‌పై మోజు తగ్గేలా కనిపించడం లేదు.