Venkatesh: వెంకటేష్‌ను లైన్‌లో పెట్టిన `జాతిర‌త్నం`.. త్వ‌ర‌లోనే అప్డేట్‌!?

Share

Venkatesh: విక్ట‌రీ వెంక‌టేష్.. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ స‌క్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారీయ‌న‌. `నారప్ప`, `దృశ్యం` చిత్రాలతో వ‌రుస హిట్స్‌ను ఖాతాలో వేసుకున్న వెంక‌టేష్‌.. ఇటీవ‌ల `ఎఫ్ 3`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మిది.

ఇందులో వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టంచగా.. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. మే 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం వెంక‌టేష్ రానా ద‌గ్గుబాటితో క‌లిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. బాబాయ్‌, అబ్బాయ్ వెండితెర‌పై క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో ఈ సిరీస్ పై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

హాలీవుడ్ సిరీస్ రే డొనోవ‌న్ ఆధారంగా రూపొందుతోన్న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే బాలీవుడ్ లో కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంట‌గా `కభీ ఈద్ కభీ దివాలీ` అనే మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో వెంకీ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. అలాగే తాజాగా వెంకీని దర్శకుడు అనుదీప్ కెవీ లైన్ పెట్టాడ‌ట‌.

‘జాతిరత్నాలు’ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన అనుదీప్ కెవీ.. రీసెంట్‌గా ఓ క‌థ‌ను సిద్ధం చేసి వెంకీకి వినిపించార‌ట‌. అది బాగా న‌చ్చ‌డంతో.. వెంట‌నే వెంక‌టేష్ ఓకే చెప్పాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్డేట్ కూడా రానుంద‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, అనుదీప్ కెవీ ప్ర‌స్తుతం కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌ తో `ప్రిన్స్` అనే మూవీ చేస్తున్నాడు.ఇదీ పూర్తైన వెంట‌నే వెంకీ, అనుదీప్ ల ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని అంటున్నారు.


Share

Recent Posts

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

2 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

54 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago