22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
Entertainment News సినిమా

ఆ యంగ్ హీరో పాలిట దేవుడిగా మారిన వెంక‌టేష్‌..అదిరిన సర్ప్రైజ్!

Share

టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో పాలిట దేవుడిగా మారాడు విక్టరీ వెంకటేష్. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు విశ్వక్ సేన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తనదైన టాలెంట్ తో అన‌తి కాలంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్ సేన్.. ప్రస్తుతం `ఓరి దేవుడా` అనే మూవీలో నటిస్తున్నాడు.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన `ఓమై క‌డువ‌లే` చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తునే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మిథిలా పాల్క‌ర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పీవిపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Ori Devuda Surprise Glimpse
Ori Devuda Surprise Glimpse

అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను పోషించగా.. తెలుగులో ఈ స్పెషల్ రోల్ లో విక్టరీ వెంకటేష్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫామ్ చేస్తూ తాజాగా ఓ సర్ ప్రైజింగ్ గ్లింప్స్‌ను బయటకు వదిలారు.

ఈ వీడియో లో విక్టరీ వెంకటేష్ ఎంతో స్టైలిష్ గా కనిపించడమే కాదు తనదైన మేనరిజమ్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ గ్లింప్స్‌లో విశ్వ‌క్‌, రాహుల్‌ రామకృష్ణలు క‌నిపించారు. మొత్తానికి అదిరిపోయిన ఈ గ్లింప్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది.

https://youtu.be/SSIUkuMiXBc

 

 


Share

Related posts

RRR: మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న “RRR”..!!

sekhar

పాపం మృణాల్‌.. తొలి సినిమా టైమ్‌లో అన్ని క‌ష్టాలు ప‌డిందా?

kavya N

సమంతా సరికొత్త క్యారెక్టర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్…??

sekhar