టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లవ్ లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా `గీతగోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల్లో నటించారు. వీటిలో గీతగోవిందం సూపర్ హిట్ గా అవగా.. డియర్ కామ్రేడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
విజయ్-రష్మికల మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్క్ అయింది. వీరిద్దరి కెమిస్ట్రీని చూశాక విజయ్, రష్మికలు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. అందుకు తోడు వీరిద్దరూ తరచూ కలవడం, చట్టపట్టలేసుకొని తిరగడం వంటి అంశాలు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఇక తాజాగా వీరిద్దరి లవ్ కన్ఫామ్ అయిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే రీసెంట్గా రష్మిక, విజయ్ కలిసి వెకేషన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. ఒకే సమయంలో వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. అయితే తాజాగా రష్మిక మాల్దీవ్స్ లో దిగిన ఓ హాట్ పిక్ ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
అయితే ఈ పిక్ లో రష్మిక కంటే ఆమె ధరించిన గాగుల్స్ హాట్ టాపిక్ గా మారాయి. అందుకు కారణం లేకపోలేదు..మొన్న ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ పెట్టుకున్న సన్ గ్లాస్సెస్ నే రష్మిక కూడా మాల్దీవ్స్ లో పెట్టుకుని దర్శనమిచ్చింది. దీంతో వీరిద్దరూ కలిసే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారని, వీరిద్దరి లవ్ కన్ఫామ్ అంటూ ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు, ఒక్క పిక్‌తో రష్మిక దొరికిపోయిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CjdHv8hqgsY/?utm_source=ig_web_copy_link