టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరకొండ కెరీర్లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది.
రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
`ఖుషీ`లో విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉండబోతోందో తెలుసా?
ఇందులో భాగంగానే నిన్న ఈ సినిమా నుంచి `అక్డీ పక్డీ` అంటూ సాగే పార్టీ సాంగ్కు బయటకు వదిలారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ మాస్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ లో మాంచి జోష్ ను నింపుతోంది. ముఖ్యంగా ఇందులో విజయ్ దేవరకొండ అదిరిపోయే స్టెప్పులు వేసి విశేషంగా ఆకట్టుకున్నాడు. వాస్తవానికి విజయ్ అంత మంచి డ్యానర్ ఏమీ కాదు. అందుకే ఆయన సినిమాల్లో పెద్దగా మాస్ సాంగ్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా ఆయన ఓ రేంజ్లో స్టెప్పులేసిన దాఖలాలు లేవు.
కానీ, `అక్డీ పక్డీ` సాంగ్లో మాత్రం అదరగొట్టేశారు. తనకూ డ్యాన్స్ వచ్చని నిరూపించుకున్నాడు. ఈయన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్కు సూపర్ రెస్పాన్స్ రావడంతో.. విజయ్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. అందులో `అక్డీ పక్డీ` సాంగ్ కొరియోగ్రఫీ, షూటింగ్ గురించి వివరించాడు. ఈ పాట కొరియోగ్రఫీ చూసినప్పుడు తాను ఏడ్చేశానని.. కానీ షూటింగ్లో మాత్రం బ్లాస్ట్ చేసేశని విజయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఆయన ట్వీట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.
I almost cried when I saw the choreography.
But had a Blast shooting this ❤️#AKDIPAKDIhttps://t.co/v6PggR0QHV#LIGER#LigerOnAug25th pic.twitter.com/nWAAoareqv
— Vijay Deverakonda (@TheDeverakonda) July 12, 2022