టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అమ్మాయిలతో ఫైటింగ్ చేశాడట. అది కూడా ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 14 మంది అమ్మాయిలతో ఫైటింగ్ చేశాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే.
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలను పోషించారు. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 25న మొత్తం ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ వరుస అప్డేట్స్ను వదులుతూ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ మూవీ ప్రీ క్లైమాక్స్‌తో ఓ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ప్రత్యేకత ఏమిటంటే 14 మంది అమ్మాయితో విజయ్ దేవరకొండ ఫైట్ కి దిగుతాడట.
ఆ లేడీ ప్రొఫెషనల్ ఫైటర్స్ హీరోగారికి ముచ్చెమటలు పట్టిస్తారట. ఐదు నిమిషాలకు పైగా సాగే ఈ ఫైట్ సీన్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే సినిమాకే ఒక హైలైట్ కూడా ఉండబోతోందట. ఈ ఫైట్ సీన్ కోసం పూరీ ఆ 14 మంది అమ్మాయిలను ఫారెన్ నుంచి దింపారట. వారందరూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నవారే అని అంటున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!