టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈయన `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం.. సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దీంతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో బిగ్ డిజాస్టర్ వచ్చి పడింది. ఇక ప్రస్తుతం ఈచన చేతిలో `ఖుషీ`, `జనగణమన` ప్రాజెక్స్ట్ ఉన్నాయి. అలాగే సుకుమార్ తో ఓ సినిమా, దిల్ రాజు నిర్మాణలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే విజయ్ దేవరకొండకు బిగ్ హిట్ ఇవ్వడం కోసం దిల్ రాజు తాజాగా ఓ దర్శకుడిని ఎంపిక చేశాడట.
ఆయన మరెవరో కాదు.. హరీశ్ శంకర్. ప్రస్తుతం ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `భవదీయుడు భగత్ సింగ్` చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్ లో విజయ్ తో సినిమా చేసేందుకు హరీశ్ శంకర్ ఒకే చెప్పారట.
విజయ్ కూడా హరీశ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపడంలో.. దిల్ రాజు వీరి కాంబో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని తాజాగా టాక్ బయటకు వచ్చింది. `ఖుషి` మూవీ అనంతరం ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోందని కూడా వార్తలు రావడంతో.. విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. ఆయన చేసిన తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ హిట్లు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో సినిమా అంటే విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!