టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం `లైగర్`. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది.
రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, రియల్ బాక్సర్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 25న ఈ చిత్రం మొత్తం ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఇటు నార్త్‌లోనూ, ఇటు సౌత్‌లోనూ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండకు `లైగర్ ఫ్లాప్ అయితే మీ స్పందన ఏంటి` అని ప్రశ్న ఎదురైంది.
అందుకు ఆయన ఊహించని రిప్లై ఇచ్చాడు. `అలాంటి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవలసిన పనిలేదు. నేను కెరీర్ ప్రారంభించిన టైమ్‌లో ఇదే ప్రశ్న అడిగుంటే ఖచ్చితంగా కోపంతో విరుచుకుపడేవాడిని. దానికి తగ్గ సమాధానం ఇచ్చేవాడిని. ఎందుకంటే నాకు కోసం ఎక్కువ.
కానీ కొద్దిరోజులుగా సినీ ప్రియులు నాపై చూపిస్తున్న ప్రేమ నాలో మార్పు తీసుకొచ్చింది. నాకు ప్రేక్షకులే ముఖ్యం. వాళ్ల కోసమే సినిమాలు చేస్తున్నా. ఈ ప్రచార కార్యక్రమాల వల్ల ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్నా` అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. దాంతో ఈయన కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!